బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీ లియాన్ కి ఎటువంటి క్రేజ్ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో ఈమె క్రేజ్ రోజు రోజుకి పెరిగి పోయింది. కావాలంటే ఋజువులు కూడా ఉన్నాయి. బాలీవుడ్ లో ఉన్న గ్లామర్ హీరోయిన్లు వెనక్కి నెట్టేసి పక్కన పెట్టేసి మొదటి స్థానానికి దూసుకు వచ్చింది. తాజాగా 'యాహూ సెర్చ్ ఇంజన్‌' లో నెటిజెన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన పేరు ఎవరిదో తెలుసా! సన్నీలియోన్‌దే?

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUNNY' target='_blank' title='sunny - గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sunny </a>Leone

యాహూ తాజాగా ఇండియన్ నెటిజన్స్‌పై చేసిన సర్వేలో సన్నీ లియాన్ పేరు టాప్ అని తేలింది. ఆమె తరువాతి స్థానాల్లో ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యారాయ్‌లు ఉన్నారు. మొత్తానికి రోజు రోజుకు సన్నీ లియాన్ తన క్రేజ్ పెంచుకునే విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే వుంది. బాలీవుడ్‌లో క్రేజీ సినిమాల్లో నటిస్తూ గ్లామరస్ తారగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ  సౌత్‌ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.


స్టార్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న సన్నీలియాన్‌ లో మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయి. సన్నీలియాన్ 2011 లో డానియల్ వెబర్‌ను ప్రేమించి పెళ్లిచేసు కుంది. అప్పటి నుంచి వారిద్దరూ చక్కగా కాపురం చేస్తూ కలిసే ఉంటున్నారు.  ఒక పోర్న్ స్టార్ ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో కాలంగా కలిసి ఉండటం అన్నది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒక స్త్రీగా, గృహిణిగా సంసార జీవితం హాయిగా ఉందని అంటోంది సన్నీలియాన్.
Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUNNY' target='_blank' title='sunny - గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sunny </a>Leone
ఇక ఛారిటీ సంస్థలకు, సామాజిక సంస్థలకు సన్నీలియాన్ ప్రచారకర్తగా ఉంటూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషిచేస్తోంది. అమెరికా క్యాన్సర్ సొసైటీకి, పెటా సంస్థకు సన్నీలియాన్ తన సేవలను అందిస్తూ సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. ముంబయ్‌ లోని ఒక పాఠశాలను దత్తత తీసుకొని ఆ స్కూల్‌కు కావల్సిన వసతులను సమకూరుస్తోంది. సన్నీలియాన్ ఒక మంచి చెఫ్ కూడానట. ఇంట్లో ఉన్నప్పుడు తన భర్త డానియల్ వెబర్‌ కు తానే స్వయంగా వంటచేసి పెడుతుందట.


అంతటి అన్యోన్య దాంపత్య జీవితం వారిద్దరిది. వంట చేయడమంటే ఒక మహిళగా తనకు చాలా ఇష్టమని చెబుతోంది. ఇక తనను పోర్న్‌ స్టార్‌గా ఇప్పటికీ చూస్తూ కొందరు తనపై చేసే కామెంట్లను ఎంతో సహనంతో భరిస్తోందట సన్నీలియాన్. ఇలా ఈ అమ్మడిలో ఒక మంచి గృహిణి, ఒక మంచి సామాజిక కార్యకర్త, మంచి నటి ఉండడం విశేషమే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: