బిగ్‌బాస్‌ సీజన్ -3 గ్రాండ్‌ ఫినాలే విన్నర్ గా పాప్ సింగర్ రాహుల్ సిప్లి గంజ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. 50 లక్షల రూపాయల్ చెక్ ని కూడా విన్నర్ కి అందజేయడం జరిగింది. ఫైనల్ కి మొత్తం 5 కాంటెస్టులు ఉండగా రాహుల్ , శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజా ఎలిమినేషన్ కి ఉన్నారు. ఎలిమినేషన్ మొదలవగానే ముందుగా అలీ రెజా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత హీరో వరుణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇలా వరుణ్ ఎలిమినేట్ అయినందుకు వరుణ్ వైఫ్ వితికా హర్ట్ అవుతుందనుకుంటే త్వరగా హౌజ్ నుంచి బయటకు తీసుకు వచ్చినందుకు చాల హ్యాపీగా ఫీలయింది. 

ఇక ఎలిమినేషన్ రౌండ్లో చివరిగా బాబా భాస్కర్ హౌజ్ నుండి ఎలిమినేట్ అవగా రాహుల్ , శ్రీముఖి మాత్రమే రేస్ లో మిగిలారు. ఇక గ్రాండ్ ఫినాలేకు అదనపు ఆకర్షణగా నిలిచేందుకు వచ్చిన హీరో శ్రీకాంత్‌ సరదాగా గడిపారు. అంతేకాదు పునర్నవి తనకు బా ఇష్టమైన కంటెస్టెంట్‌ అని శ్రీకాంత్ సరదాగా నవ్వించాడు. శ్రీకాంత్ తో పాటుగా హీరోయిన్స్ అంజలి, క్యాథరిన్‌, రాశి ఖన్నా గ్రాండ్‌ ఫినాలేకు విచ్చేసి ఆట పాటలతో సందడి చేశారు. ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్ అదిరిపోయో డాన్సుల తో షోకి గ్లామర్ యాడ్ చేయగా, అనురాగ్‌ కులకర్ణి పాడిన 'రాములో రాములా..' పాటతో అందరు ఉర్రూతలూగారు. ఈ రకంగా బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్‌ ప్రేక్షకులకు ఫుల్ స్వింగ్ లో ఎంటర్‌టైన్‌ చేసింది. 

ఇక ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి వచ్చిన సైరా నర సింహారెడ్డి..మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీతో షో ఒక్కసారిగా పీక్స్ కి వెళ్ళింది. ఇక చిరు, నాగ్ ల మధ్య జరిగిన సరదా సంభాషణలు..ఒకరికొకరు పోటీ పడి వేసుకున్న పంచ్ డైలాగ్స్ కి ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అంతేకాదు చిరు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ప్రశంషిస్తుంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఫైనల్ విన్నర్ రాహుల్ అని నాగ్ అనౌన్స్ చేయగానే శ్రీముఖి మొహం లో కాస్త నిరాశ కనిపించింది. వాస్తవంగా చూస్తే ముందు నుంచి అందరు ట్రోఫీని శ్రీముఖి గెలుచుకుంటుందని ధీమాగా ఉన్నారు. ఆఖరికి శ్రీముఖి కూడా. కానీ అనూహ్యంగా రాహుల్ ఫైనల్ విన్నర్ గా నిలిచాడు. ఇక ఫైనల్ విన్నర్ అయిన రాహుల్ కి మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీని అందించారు. అయితే అప్పుడే బిగ్ బాస్ షోలో పాలిటిక్స్ జరిగాయని అందుకే రాహుల్ విన్నర్ అయ్యాడని శ్రీ ముఖి ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: