తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్లు తక్కువైపోయారు. తెలుగు తప్ప ఏ భాష నుంచి వచ్చినా టాలీవుడ్ లో స్థానం దక్కుతోంది. గ్లామర్ తో కొందరు టాలెంట్ తో మరికొందరు తెలుగు తెరపై రాణిస్తున్నారు. అలా ప్రస్తుతం తెలుగులో టాప్ రేస్ లో దూసుకుపోతున్న భామ రష్మిక మందనా. కన్నడ భామ అయిన రష్మిక ప్రస్తుతం తెలుగులో టాప్ పొజీషన్ కు పోటీ పడుతున్న హీరోయిన్.

 


ఛలో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన రష్మిక ఆ సినిమాతో తొలి హిట్ అందుకుని తెలుగులో పాగా వేసింది. ఓవర్ నైట్ స్టార్ కాకపోయినా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసలో నిలిచింది. ఆ సినిమా తర్వాత చేసిన గీత గోవిందం ఆమె దశను మార్చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ తో ఏకంగా ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాలో చాన్స్ కొట్టేసింది. మహేశ్ పక్కన హీరోయిన్ అవకాశమంటే సామాన్యమైన విషయం కాదు. కెరీర్లో త్వరగానే ఈ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో భారీ ఆఫర్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. బన్నీ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా రష్మికనే. అంటే.. దాదాపు టాప్ లెవెల్లో అమ్మడి కెరీర్ ఉన్నట్టే.

 

 

హాట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో చేసిన డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినా రష్మిక గ్రాఫ్ తగ్గలేదు. ప్రస్తుతం మహేశ్, బన్నీలతో చేస్తున్న సినిమాలు క్లిక్ అయ్యాయంటే మాత్రం రష్మిక స్టార్డమ్ ఓ రేంజ్ కు వెళ్లిపోతుంది. ఆమె కాల్షీట్స్ కోసం నిర్మాతలు క్యూలు కట్టాల్సిందే. చిలిపి నటనతోపాటు, హావభావాలతో ఉన్న నటన రష్మిక సొంతం. మహేశ్, బన్నీలతో రష్మిక జోడీ చూడటానికి కూడా బాగుంటుంది. ఈ సినిమాలు అమ్మడికి కీలకమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: