న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని  వాళ్ళు ఉండరేమో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ.. కన్నీళ్లను దిగమింగుకుంటూ వచ్చిన నాని.. ఈరోజు న్యాచురల్ స్టార్ నానిగా పేరు సంపాదించాడు. మొదట రేడియో జాకీగా పనిచేసిన నాని అలా ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ వచ్చాడు. ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్గా, సినిమాటోగ్రాఫర్ గా,  హీరోగా, యాంకర్ గా, ఇప్పుడు నిర్మాతగా రాణిస్తూ వస్తున్నాడు. అది నాని అంటే. వెనకాల ఎటువంటి పెద్ద తలకాయలు లేకుండా స్వశక్తితో పైకొచ్చిన వాళ్ళల్లో నాని ఒకరు. 

నానికి హిట్ ఇచ్చిన సినిమాల విషయానికొస్తే.. మొదట అష్ట చమ్మ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యి మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. నాని వెనక్కి  చూసుకొలేని కొన్ని సినిమాలు ఉన్నాయి అవేంటో ఇప్పడు చూద్దాం.. 


అష్టాచమ్మా :
హీరోగా ఎంటర్ అయినా ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో మనకు తెలిసిన విషయమే.. ఈ సినిమా నాని లైఫ్ కి మలుపు అని చెప్పాలి. ఈ సినిమా గురించి చెప్పాలంటే హీరోగా నాని ని నిలబెట్టింది అని చెప్పాలి. 

అలా మొదలైంది :
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే.   ఆ సినిమా కూడా అవార్డులను తెచ్చిపెట్టింది. అదే విదంగా సినిమా కూడా బాగా హిట్ అయ్యింది. నానికి మెయిన్ సినిమా చైత్రయిలో నిలిచింది. 

ఈగ:
ఈగ సినిమాలో నాని చేసిన పాత్ర చిన్నదే అయినా కూడా అవార్డ్ ఇచ్చిన సినిమాగా బాగా పేరు తెచ్చుకున్నది. ఇకపోతే ఈ సినిమాతో నాని రేంజు మరో స్టేజ్ కి వెళ్ళింది కూడా..


జెంటిల్మెన్: 
నాని సినిమాలలో గ్రేట్ సినిమా అంటే ఈ సినిమా కూడా చెప్పవచ్చును.. అంతగా ఫేమస్ అయింది. 
ఇలా సినిమాల విషయానికొస్తే 26 సినిమాలు హిట్ అయ్యాయని చెప్పాలి. ఆ సినిమాలు పూర్తిగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన సినిమాలే.. ఇదండీ నాని కి లైఫ్ ఇచ్చిన సినిమా ఇవే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: