ప్రస్థుతం టాప్ హీరోల సినిమాల కలక్షన్స్ విషయంలోనే కాకుండా టాప్ హీరోల లగ్జరీ విషయంలో కూడ విపరీతమైన పోటీ జరుగుతోంది. బాలీవుడ్ హీరోల స్థాయికి మించి మన టాప్ హీరోల లగ్జరీ లపై ఖర్చు పెడుతున్న అత్యంత భారీ మొత్తాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి టాప్ హీరోకు అత్యంత విలాసవంతమైన సొంత కార్వాన్ లు కలిగి ఉండటం ఒక కల్చర్ గా మారింది. వీటికోసం మన హీరోలు అంతా 5 కోట్ల నుండి 8 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. కొంతకాలం క్రితం అల్లు అర్జున్ ‘ఫాల్కన్' అనే పేరుతో ఒక విలాసవంతమైన కార్వాన్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే మహేష్ కు ఒక మంచి కార్వాన్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ విషయంలో మహేష్ బన్నీతో పోటీ పడుతూ మరింత మెరుగైన వసతులు ఉండేలా కొత్త కార్వావాన్ డిజైన్ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా మహేష్ అభిరుచులకు తగ్గట్టుగా కార్వాన్ ను డిజైన్ చేయించి ఇచ్చినట్లు టాక్. 

మహేష్ అవుట్ డోర్ షూట్ లకు హాజరైన సమయంలో మహేష్ విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లతో పాటుగా షూటింగ్ సమయంలో మహేష్ కుటుంబ సభ్యులు కూడా హాయిగా గడపగలిగేలా ఈ వ్యాన్ ను డిజైన్ చేయించారట. ఇందులో అన్ని రకాల వసతులు ఉండటంతో  టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ కార్వాన్ అత్యంత ఖరీదైంది అని అంటున్నారు. ఇప్పుడు ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో సంక్రాంతి రేస్ లో బన్నీ మహేష్వార్ ఫలితాలు తెలియకుండానే మహేష్ బన్నీ పై ఆధిపత్యం సంపాదించాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఇలా బయటకు రావడంతో మహేష్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: