ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో 360 సీజన్లు పూర్తి చేసుకున్న అతి పెద్ద రియాలిటీ షో, బిగ్ బాస్ షో. ఇప్పటివరకు ఇండియాలో 36 భాషల్లో 7 సీజన్స్ జరిగాయి. ఇక మొన్నటి వరకు నాగార్జున హోస్ట్ గా జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 కధ ముగిసింది. తన తీయని స్వరంతో కోట్లాది మంది మనసులు గెలుచుకుని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకున్నారు. 105 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎమోషన్స్ చూసిన రాహుల్ ఎట్టకేలకు విజేతగా ట్రోఫీతో పాటుగా రూ.50లక్షలు అందుకున్నాడు.


ఇక ఈ ట్రోఫీని మెగా బాస్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ అందుకున్నారు. ఇకపోతే ఈ ఫినాలేలో శ్రీముఖిని రన్నర్ గా ప్రకటించారు. ఇకపోతే బుల్లితెరపై 100 రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ షో ఎంతో ఉత్కంఠగా సాగింది. ఈ సందర్భంగా  నాగార్జున మాట్లాడుతూ 25 ఏళ్లుగా బిగ్ బాస్ ఇండియాలో పాపులరైంది. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బ్రదర్ గా అందరికీ సుపరిచితం అని వెల్లడించారు.


బిగ్ బాస్ గ్రేట్ షో అని నాకు తెలుసు. కోట్లాది మంది అభిమానించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇలాంటి షో గ్రేట్ ఫినాలేకి నన్ను అతిధిగా పిలవడం నా మిత్రుడు నాగ్ కి థాంక్స్ అని చిరంజీవి తెలిపారు. ఇదిలా ఉండగా, కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 హంగామా జూలై 21 నుంచి ప్రారంభమైంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లంతా టీవీ, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలే.


ఈ సీజన్‌లో  గత సీజన్ మాదిరిగా సాధారణ వ్యక్తులను తీసుకోలేదు. కాబట్టి ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారింది. 106 రోజులు నడిచిన ఈ రియాలిటీ షో ఆదివారం ముగిసింది. మొత్తం ఐదుగురు సభ్యులు.. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాలు ఫైనల్‌కు చేరగా.. రాహుల్ విజేతగా నిలిచాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: