టాలీవుడ్ కి ఎంతటి దాహమో అది తీరేది కాదు. ఆగేది కాదు, ఎందుకంటే స్వర్ణయుగం రోజుల నుంచి చూసుకుంటే టాలీవుడ్ కి కధా బలం ఎంతగా ఉన్నా కూడా మరో వైపు గ్లామర్ కూడా అంతే అవసరం ఉంది. గ్లామర్ సౌత్ లో ఎక్కువగా చూపించేది టాలీవుడ్ అయితే చూసేది తెలుగు ఆడియన్స్. అందుకే ఎక్కడెక్కడ బ్యూటీస్ కూడా టాలీవుడ్ మీద ఒక లుక్కేస్తారు.


ఇపుడు ఆ వరసలో మరో కేరళ కుట్టీ చూపు టాలీవుడ్ మీద పడిందట. ఆమె ఎవరో కాదు ఐమా సెబాస్టియన్. మళయాళంలో ఆమె ఒక సినిమా నటించింది. అటు గ్లామర్ ఇటు యాక్షన్ రెండూ కూడా మేళవించిన ఆ  మూవీ సూపర్ హిట్ కావడమె కాదు, ఐమాకు ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చేసింది. ఇపుడు అక్కడంతా ఐమా అంటున్నారు.


మరి ఆమె నటించిన ఆ మూవీ పడయోత్తం. అక్కడ సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆ రైట్స్ తీసుకుని రీమేక్ చేస్తున్నారు. మరి  ఐమా అందం చూసి ఇక్కడ కూడా ఆమెనే హీరోయిన్ అనేసుకున్నారు. తెలుగు రీమేక్ లో సుమంత్ హీరోగా చేస్తున్నాడు. మరి ఆయన పక్కన తొలి అవకాశం పొందిన ఐమా ఈ మూవీ సంగతి ఎలా ఉన్నా మొత్తానికి  తెలుగులోకి అడుగుపెట్టేసింది.


ఇక ఈ మూవీ హిట్ ఫట్ తో సంబంధం లేకుండా ఐమాను టాలీవుడ్ లిఫ్ట్ ఇచ్చి మరీ అక్కున చేర్చుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఐమా అందం అలాంటిది మరి. ఈ మళయాళం ముద్దు గుమ్మ టాలీవుడ్ ఎంట్రీతో మిగిలిన హీరోయిన్ల గుండెలు పీచుపీచుమంటున్నాయట.  మరి ఐమా టాలీవుడ్లో గ్లామర్ సెగలు పొగలు పెట్టి ఎలా తనవైపు మొత్తం   అందరినీ తిప్పుకుంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: