నిన్న జరిగిన ‘బిగ్ బాస్ 3’ సీజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన చిరంజీవి నాగార్జునను ఆకాశంలోకి ఎత్తేస్తూ అనేక ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఇదేసందర్భంలో మాట్లాడుతూ నాగార్జునకు కోపంలేదని ఇండస్ట్రీలోని వారైతే నాగ్ పేరు చెపితే ‘కుకట్ పల్లి నుండి అంబర్ పెట్ కు పారిపోతుంది’ అంటూ సరదాగా జోక్ చేస్తూ ఉంటారు అన్నవిషయాన్ని వివరించాడు.

అలాంటి నాగార్జున కూడ ‘బిగ్ బాస్ 3’ సీజన్ తన బ్యాలెన్స్ తప్పి మధ్యమధ్యలో అసహనానికి గురవుతూ హౌస్ మేట్స్ తో చేసిన కామెంట్స్ చూస్తే తనకు ఆశ్చర్యం కలిగించిన విషయాన్ని వివరిస్తూ ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వస్తే ఒక మనిషి ఆశ్చర్యంగా ఎలా మారిపోతాడు అన్నవిషయం తనకు అర్ధం అయింది అంటూ కామెంట్స్ చేసాడు. ఇది ఇలా ఉండగా నిన్నటితో ముగిసిన ‘బిగ్ బాస్ 3’ షో నిర్వహణలో నాగార్జున ఏమేరకు సక్సస్ అయ్యాడు అన్నవిషయమై అప్పుడే కొన్ని ఆసక్తికర కామెంట్స్ వస్తున్నాయి.

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ద్వారా బుల్లితెర కింగ్ అనిపించుకున్న నాగార్జున ‘బిగ్ బాస్ 3’ సీజన్ హోస్ట్ గా కేవలం పాస్ మార్కులే విమర్శకుల చేత వేయించుకున్నాడు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈషో హోస్ట్ గా నాగార్జున ఎంపిక అయినప్పుడు అనేక అంచనాలు ఏర్పడినా తనకు తెలిసిన రెండు మూడు ట్రిక్ లతో ఈ 100 రోజులు నాగార్జున తెలివిగా మేనేజ్ చేసాడు కాని ఈషో ద్వారా నాగార్జున క్రియేట్ చేసిన కొత్త ఒరవడి ఏమిలేదు అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.

ముఖ్యంగా నాగార్జున తన షష్టిపూర్తి సందర్భంగా తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళినప్పుడు ఆగ్యాప్ కు సంబంధించిన వీకెండ్ షోలో రమ్యకృష్ణ హోస్ట్ చేసిన ఆరెండు రోజుల షోకు నాగార్జున ఈషోకి సంబంధించి హోస్ట్ చేసిన అన్ని వీకెండ్స్ షోలకు మించి టిఆర్పి రేటింగ్స్ ఎక్కువ వచ్చాయి అన్నవార్తలు కూడ ఉన్నాయి. కేవలం తాను హోస్ట్ చేసిన 2 ఎపిసోడ్లలోనే రమ్యకృష్ణ చూపించిన హుందాతనం కంటెస్టెంట్లను ఆమె విశ్లేషించిన విధానం నాగార్జున చేసిన దానికంటే చాల బాగుంది అన్నఅభిప్రాయం చాలామందిలో ఉంది. దీనితో నిన్నటితో ముగిసిన ‘బిగ్ బాస్’ సీజన్స్ మూడింటిని విశ్లేషిస్తే మొదటి సీజన్ జూనియర్ స్థాయికి నాని నాగార్జున చేరుకోలేక పోయారు అన్నమాటలు కూడ వినిపిస్తున్నాయి..     



మరింత సమాచారం తెలుసుకోండి: