తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా ముగిసింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యి టైటిల్ విన్నర్ రాహుల్ కి టైటిల్ అందజేసి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో పంచులు వేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. దాదాపు 17 మంది సభ్యులు హౌస్ లోకి ఎంటర్ కాగా కేవలం చివరాకరికి ఐదుగురు మాత్రమే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి వెళ్లడంతో ఐదుగురిలో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ గత వారం అంతా నెలకొనడంతో సీజన్ 3 ఫినాలే చాలా ఉత్కంఠభరితంగా సాగింది. శ్రీముఖి మరియు రాహుల్ మధ్య పోటాపోటీ ఓటింగ్ నెలకొనడంతో చివరాఖరికి రాహుల్ గెలవడంతో ప్రస్తుతం రాహుల్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాహుల్ టైటిల్ విన్నర్ అవుతాడని హౌస్ లో టికెట్ టు ఫినాలే వీక్ లో బాబా భాస్కర్ కామెంట్ చేసిన సందర్భాన్ని రాహుల్ అభిమానులు గుర్తు చేసుకుని టంగ్ పవర్ చాలా పవర్ ఫుల్ గా ఉందని కామెంట్ చేస్తున్నారు.


క్లియర్ కట్ గా విషయంలోకి వెళ్తే శివ జ్యోతి ఎలిమినేషన్ కాకముందు హౌస్ లో ఉన్న సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న చెట్టు దగ్గర శ్రీముఖి మరియు బాబా భాస్కర్ సరదాగా మాట్లాడుకుంటున్న తరుణంలో బాబా భాస్కర్ స్వామి గా కూర్చుని ఇంట్లో ఒక్కొక్క సభ్యుడు గురించి మాట్లాడుతూ శివ జ్యోతి గురించి మాట్లాడగా...పోయే కాలం వస్తే ఎవరు ఆపలేరు అని బాబా భాస్కర్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దీంతో శ్రీముఖి పోయేకాలం అంటే అని ప్రశ్నించగా ముందు కనపడుతుంది లే అని బాబా భాస్కర్ టంగ్ స్లిప్ అయ్యారు. సీన్ కట్ చేస్తే ఆ వారం ఇంటి నుండి శివ జ్యోతి ఎలిమినేట్ అయింది.


ఇక టికెట్టు ఫినాలే వారంలో హౌస్ లో బాబా భాస్కర్తో శ్రీముఖి సోఫాలో కూర్చుని మాట్లాడుతూ ఉన్న తరుణంలో...మళ్లీ శ్రీముఖి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మాస్టర్ అని ప్రశ్నించగా...బాబా భాస్కర్ రాహుల్ విన్నర్ అవుతాడని అని ప్రశ్నించగా శ్రీముఖి స్పందిస్తూ మరి నేను అని అనగా...నువ్వు రన్నర్ అని బాబా భాస్కర్ చెప్పటంతో చివరాకరికి రాహుల్ విన్నర్ కావడంతో...బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ కి టైటిల్ రాకపోయినా కానీ టంగ్ పవర్ వచ్చిందని సోషల్ మీడియాలో అంటున్నారు నెటిజన్లు రాహుల్ అభిమానులు.  



మరింత సమాచారం తెలుసుకోండి: