ఇపుడు సామజిక మాధ్యమాల్లో ఒక నటి యొక్క చిన్ననాటి ఫోటో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వైరల్ అయినా ఫోటో ఇంటర్నెట్ అంత బాగా చెక్కర్లు కొడుతుంది. పైన ఫోటో లో ఉన్న బాలికను చూసారా? ఎంత స్టైలిష్ గా కూర్చుందో, ఫోటో కి బ్రహ్మాండంగా పోజ్ ఇచ్చింది కదా? అవునండి అవును. చిన్నతనం లోనే తనలో పెద్ద నటి అయ్యే కల ఉట్టిపడింది. 


ఇంతకీ ఆ ఫోటో లో ఉన్న బాలిక ఎవరో గుర్తుపట్టారా? తను ఎవరో కాదండి.. మన గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన్న. ఈ 23 ఏళ్ళ కన్నడ అందాలతార తన చిన్ననాటి ఫోటో ని ట్విట్టర్ లో షేర్ చేసారు. అంతే ఇక తన అభిమానులు ఈ ఫోటోని చూసి బాగా ముచ్చటపడుతున్నారు. తను ఈ ఫోటో షేర్ చేసిన వెంటనే వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి, 1 వేయి కి పైగా తన ఫాలోయర్స్ రీట్వీట్ చేసారు.


రష్మిక కి తన చిన్ననాటి ఫొటోస్ షేర్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇప్పటివరకు ఆమె తన చిన్ననాటి ఫొటోస్ చాలా షేర్ చేసారు. అవి కూడా ఫుల్ గా వైరల్ అయ్యాయి. అటు వెండితెర పైన ఇటు సోషల్ మీడియా లో తన అందచందాలతో తన ఫాలోయర్స్ ని ఎల్లప్పుడూ అలరిస్తుంది ఈ కన్నడ స్టార్. 


ఇక రష్మిక సినీ జీవితానికి వస్తే, ఆమె మహేష్ సరసన 'సరిలేరు నీకెవరు' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మహేష్ బాబు తో ఓ హాట్ లిప్ లాక్ చేసిందని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో మొట్టమొదటి సారిగా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఏఏ20 సినిమాలో అలరించనున్నారు రష్మిక. ఈ సినిమాకి పూజ కార్యక్రమం కూడ పూర్తి అయింది. నితిన్ తో రొమాన్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు ఈ యంగ్ పాపులర్ హీరోయిన్.


మరింత సమాచారం తెలుసుకోండి: