బిగ్ బాస్ ఫైనల్ లో బాబా భాస్కర్ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టైటిల్ పోరులో పోటీ ఇచ్చినప్పటికీ చివరికొచ్చేసరికి చతికిల పడ్డాడు. ఫైనల్ కి ముందు బిగ్ బాస్ నిర్వాహకులు బాబా భాస్కర్ ని ఎంత హైలైట్ చేసారో చూశాం. అలాంటిది ఫినాలే అంతలా టార్గెట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే బాబా భాస్కర్ కి మొదటి నుండి మాస్కర్ అనే పేరు వచ్చింది. అన్నీ మనసులోనే ఉంచుకుంటాడు. ఏదీ బయట పెట్టడు అనే పేరు వచ్చింది.


అదే పేరు చివరి వరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. చాలా సార్లు నాగార్జున బాబా భాస్కర్ టార్గెట్ చేస్తూ వచ్చాడు. అసలు మాస్కర్ అన్న పేరు తీసుకువచ్చిందే నాగార్జున. మరి బాబా భాస్కర్ ఒక్కడినే అంతలా ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. చివరికి ఫినాలేలో కూడా బాబా భాస్కర్ ని అవమానించడం ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఫినాలేకి అతిధిగా వచ్చిన చిరంజీవి చేత బాబా భాస్కర్ నటించాడని చెప్పించడం ఎంత వరకు సమంజసమో తెలియదు.  


అంతే కాదు అలా నటించడమే బాగుంది. ఇక ముందు కూడా అలాగే ఉండమని చెప్పడం కూడా ఒకింత ఆశ్చర్యాన్ని కల్గించింది. చిరంజీవి చెప్పినట్టు బయట బాబ భాస్కర్ చాలా కోప్పడతాడు కావచ్చు. అక్కడ వారందరూ తన కింద పనిచేసే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కోపం ప్రదర్శించాల్సి వస్తుంది.  కానీ బిగ్ బాస్ లో ఎవరూ తనకింద పనిచేసే వారు కాదు. అంతే కాదు తనకి ఇంతకు ముందు కోపం చాలా ఎక్కువ ఉండేదని, ఇప్పుడు చాలా వరకు తగ్గించుకున్నానని హౌస్ లో చాలా సార్లు చెప్పాడు.


బిగ్ బాస్ ఫినాలే సమయంలో ఎలిమినేట్ అయిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని తప్పుగా చిత్రీక్రరించడం ఎంత వరకు కరెక్టో బిగ్ బాస్ నిర్వాహకులకే తెలియాలి. రియాలిటీ షో అంటే నిజంగా జరిగింది కాకుండా వాళ్లకు నచ్చింది చూపించాలని అనుకున్నట్టున్నారు. ఇలా చేస్తే షో మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుందనే విషయం నిర్వాహకులు గుర్తించాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: