పవన్ ‘పింక్’ రీమేక్ లో నటిస్తాడు అని వార్తలు వస్తున్న వేళ నిన్న విశాపట్నంలో జరిగిన ‘లాంగ్ మార్చ్’ లో పవన్ పొరపాటున ఆవేశంతో వాడిన కొన్ని పదాలు వల్ల తనకు తానుగా కార్నెర్ అయ్యాడా అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిన్న జరిగిన పవన్ లాంగ్ మార్చ్ కి స్పందన బాగా రావడంతో పవన్ తన గొంతులోని ఆవేశాన్ని పెంచి జగన్ ను టార్గెట్ చేస్తూ చాలా కామెంట్స్ చేసాడు. 

జగన్ అద్భుత పాలన అందిస్తే తాను వెళ్ళి సినిమాలు చేసుకుంటానని కామెంట్ చేసాడు. ఈ ఒక్క కామెంట్ ఇప్పుడు పవన్ చేయబోతున్న ‘పింక్’ రీమేక్ కు అడ్డుగా మారుతుందా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ నటించబోయే ‘పింక్’ రీమేక్ ఈ ఏడాది చివరిలో ప్రారంభం అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 
ప్రస్తుతం జగన్ అనుసరిస్తున్న ఇసుక పాలసీ పై పద్ధతి మార్చుకోవడానికి రెండు వారాలు గడువు ఇచ్చిన పవన్ వచ్చేనెల తన కొత్త సినిమాను ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అన్ని విషయాలలోను చాల అద్భుతంగా ఉంది అన్న సంకేతాలు ఇచ్చినట్లే కదా అంటూ కొందరు పవన్ కామెంట్స్ పై లోతైన విశ్లేషణలు చేస్తున్నారు. అంతేకాదు ఇసుక పాలసీ పై తన వద్ద ఒక పరిష్కారం ఉంది అని చెపుతున్న పవన్ నిన్న జరిగిన ‘లాంగ్ మార్చ్’ లో ఆ విధానాన్ని ప్రకటిస్తే బాగుండేది కదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇది ఇలా ఉండాగా నిన్న పవన్ చేసిన ఉపన్యాసంలో తాను చదివిన పుస్తకాలు రాజకీయాలలో విలువలు జవాబుదారీ తనం గురించి చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పడంతో పవన్ ఉన్యాసంలో కొత్త విషయాలు కనిపించ లేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఎన్నికలలో ఓటమి తరువాత పవన్ గొంతులో పవర్ పెరిగి నిన్న చేసిన ఉపన్యాసంతో జనసైనికులలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి తన వంతు ప్రయత్నం పవన్ సమర్థవంతంగా చేసినట్లు కనిపిస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: