తెలుగు సినీ పరిశ్రమని చాలా సంవత్సరాలు ఒక ఊపు ఊపిన హీరోయిన్ కాజల్ అగ్గార్వాల్. ఇటీవల కాలంలో తన పెళ్ళికి సంబంధించిన వార్తలు విపరీతంగా చెక్కర్లు కొడుతున్నాయి. తను ఒక బిజినెస్ మ్యాన్ ని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోపోతుందనే వార్తలు ఒక సంవత్సరం నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ కాజల్ తన పెళ్లి విషయం పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. 


పోయిన సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆమె ను ప్రశ్నించినపుడు, 'దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా ల పెళ్లిలను చూసిన తర్వాత నాకు మ్యారేజ్ చేసుకోవాలనే ఉంది కానీ నా కెరీర్ ఇపుడు పీక్ లో ఉంది. అందుకే మ్యారేజ్ ని వాయిదావేస్తున ' అని చెప్పుకొచ్చారు. 


ఈ సంవత్సరం మొదట్లో ఏం అన్నారంటే, తను సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తి కంటే వేరే రంగంలో ఉన్న వారిని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పారు. తన ఒక సాధారణమైన వ్యక్తిని లవ్ చేసి తర్వాత తన బిజీ ఫిల్మ్ షెడ్యూల్ వలన విడి పోయిన విషయం తెలిసిందే. 


ఇక ఈ మధ్యే పింక్ విల్లా వెబ్సైట్ తో కాజల్ మాట్లాడుతూ, "అవును నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న. నాకు కాబోయే భర్త ఎలావుండాలంటే, అతను నన్ను బాగా చూసుకోవాలి, ఆధ్యాత్మిక వ్యక్తే ఉండాలి", అని చెప్పారు. రీసెంట్ గా మంచు లక్ష్మి తో జరిగిన చిట్ చాట్ లో కాజల్ అగ్గార్వాల్ అన్ని రూమర్లకు చెక్ పెడుతూ తను వచ్చే ఏడాదిలోనే మ్యారేజ్ చేసుకుంటానని పూర్తి క్లారిటీ ఇచ్చింది. అది ఒక బిజినెస్ మ్యాన్ తో పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యాచ్ అని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే, కాజల్ కమల్ హాసన్ తో భారతీయడు 2 మూవీ లో కనిపించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: