బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న  లేటెస్ట్ మూవీ దబాంగ్ 3 ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను  పూర్తి చేసుకుంటుంది.  ఇప్పటికే  ప్రమోషన్స్  ను కూడా స్టార్ట్ చేసింది చిత్ర  బృందం. అందులో భాగంగా  ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్  సూపర్ రెస్పాన్స్ ను  తెచ్చుకుంది. ఈ చిత్రం హిందీ తోపాటు , తెలుగు , తమిళంలో  ఒకే సారి విడుదలవుతుంది. ఇక  విడుదలకు ముందే  ఈసినిమా  నిర్మాతలు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.   ప్రొడక్షన్ కాస్ట్  ,మార్కెటింగ్  కాస్ట్ కలుపుకొని ఈ సినిమాకు  105కోట్ల  బడ్జెట్ అయ్యింది.  అయితే  కేవలం నాన్ థియేట్రికల్  హక్కుల రూపంలోనే   ఈ సినిమా  150కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం.  అన్ని భాషలకు కలుపుకొని శాటిలైట్ హక్కులను  జీ నెట్వర్క్  80కోట్లకు  సొంతం చేసుకోగా  డిజిటల్ హక్కులను  అమెజాన్ ప్రైమ్ 60కోట్లకు దక్కించుకుంది. అలాగే మ్యూజిక్  రైట్స్ ను టీ  సిరీస్  15కోట్లకు   సొంతం చేసుకుంది. అలా ఈ చిత్రం  150కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. 




ప్రముఖ  కొరియోగ్రాఫేర్ కమ్ డైరెక్టర్  ప్రభుదేవా తెరకెక్కిస్తున్న  ఈచిత్రంలో  సోనాక్షి సిన్హా  హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్  నటుడు మహేష్ మంజ్రేకర్ చిన్న  కుమార్తె  సయి కీలక పాత్రలో నటిస్తుంది.  వీరితో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సూపర్ హిట్ సిరీస్ దబాంగ్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంఫై  భారీ అంచనాలు వున్నాయి. సాజిద్ -వాజిద్  సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని  సల్మాన్ ఖాన్ , అర్బాజ్ ఖాన్  నిర్మిస్తున్నారు . క్రిస్మస్ కానుకగా  డిసెంబర్ 20న ఈ చిత్రం   విడుదలకానుంది. మరి ఈఏడాది బాలీవుడ్ లో చివరి  మచ్ అవైటెడ్ మూవీగా వస్తున్న  ఈచిత్రం ఎలాంటి ప్[ఫలితాన్ని  రాబట్టుకుంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: