శ్రీవిష్ణు హీరోగా నిక్కి తంబోలి హీరోయిన్ గా అసుర ఫేమ్ విజయ్ కృష్ణ  ఎల్. దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్స్‌, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్  పతాకాలపై  శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో  యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించిన చిత్రం "తిప్పరా మీసం". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 8న వరల్డ్ వైడ్ గా గ్లోబల్ సినిమాస్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.. ఈ చిత్రం ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ నవంబర్ 3న హైదరాబాద్ దసపల్ల హోటల్ లో ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నారా రోహిత్, ప్రముఖ నిర్మాత యం యల్ కుమార్ చౌదరిహీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నిక్కి తంబోలి, దర్శకుడు కృష్ణవిజయ్.ఎల్, నటుడు, సమర్పకుడు అచ్యుత రామారావు, నటులు బెనర్జీ, నటి రోహిణి,  రవిప్రకాష్, రవివర్మ , కమేడియన్ నవీన్,  సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి తదితరులు పాల్గొన్నారు.. తొలి టిక్కెట్ ని వినాయక్, రోహిత్ కొనుగోలు చేశారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.


సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ఆ కథల్లో ఇన్వాల్వ్ అవుతూ కొత్త రకం సినిమాలు చేస్తున్నాడు. బ్రోచేవారేవారురా సినిమాని  మూడుసార్లు చూశాను. నాకు బాగా నచ్చింది. ఆడియెన్స్ లో సినిమా ఇండస్ట్రీలో మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు విష్ణు. ఇక ముందుకుడా ఇలాగే మంచి సినిమాలు చెయ్యాలి.  ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి.  సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతలకు మంచి లాభాలతో పాటు పేరు తీసుకురావాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు..


హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ... తిప్పారామీసం చాలా పవర్ ఫుల్ మాస్ టైటిల్.. ఇలాంటి మాస్ టైటిల్ తో చేసిన ఈ ఫంక్షన్ కి వినాయక్ గారిలాంటి మాస్ డైరెక్టర్ గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇటివరకు చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉంటుంది. విజయ్ నేను చాలా  రోజులుగా ట్రావెల్ అవుతున్నాం. చాలా దెగ్గరగా నను చూశాడు. అలాంటి వ్యక్తి నెగిటివ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. కథ చాలా సూపర్ గా ఉంది. ప్రపంచంలో ఏదైనా మారొచ్చేమో గాని అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. అలాంటి మదర్ సెంటిమెంట్ తో చేసిన ఈ చిత్రం అందరికీ మంచి ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది. మదర్ గొప్పదనం గురించి చెప్పే ఈ చిత్రంలో నటించినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. రోహిణీ గారు మదర్స్ ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రాన్ని చూసి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.. రిజ్వాన్, విజయ్, రామారావు, ఖుషీ బాగా సపోర్ట్ చేశారు.. అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: