క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు నడుస్తున్న కాలం పెద్దగా కలిసి వస్తున్నట్లుగా కనిపించడం లేదు. ‘డియర్ కామ్రేడ్’ ఫెయిల్ అవ్వడంతో ఆ మూవీ బయ్యర్లు చాల నష్టపోయారు. ఇది చాలదు అన్నట్లుగా విజయ్ నిర్మాతగా మారి తీసిన లేటెస్ట్ మూవీ ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీ బయ్యర్ల పరిస్థితి మరింత అయోమయంగా ఉంది అన్నవార్తలు వస్తున్నాయి.

ఈ మూవీని విజయ్ దేవరకొండ సుమారు కోటిన్నర పెట్టుబడితో పూర్తి చేయడంతో ఆ మూవీ షార్ట్ ఫిలింకు ఎక్కువ కమర్షియల్ సినిమాకు తక్కువగా మారింది. అయితే ఈ మూవీని విడుదలకు ముందు అతి తక్కువ రేట్లకు అమ్మడంతో ఈ మూవీని విజయ్ దేవరకొండ అభిమానులు ఒక్కసారి చూసినా విపరీతమైన లాభాలు వస్తాయి అన్న అంచనాలతో ఈ మూవీకి 2.5 కోట్ల బిజినెస్ అయినట్లు టాక్. 

మూవీ డిజిటల్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ అమ్మకాల ద్వారా విజయ్ కు మరో మూడు కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి పోటీగా విడుదలైన ‘ఆవిరి’ ఫెయిల్ అయినా ‘మీకు మాత్రమే చెప్తా’ ను పట్టించుకోకుండా అందరూ డబ్బింగ్ సినిమా ‘ఖైదీ’ వైపు వెళ్ళడంతో ‘మీకు మాత్రమే చెప్తా’ ను కొనుక్కున్న బయ్యర్లకు అన్ని చోట్లా భారీ నష్టాలు వస్తున్నట్లు సమాచారం. 

మూవీ విశాఖజిల్లా రైట్స్ ను ఒక ప్రముఖ బయ్యర్ 40 లక్షలకు తీసుకుంటే కనీసం ఇప్పటి వరకు 10 లక్షలు కూడ నెట్ కలక్షన్స్ రాని పరిస్థితి అని అంటున్నారు. ఓవర్సీస్ లో కూడ ఈ మూవీ బయ్యర్ కు ధియేటర్ల ఖర్చు కూడా రాదు అన్న వార్తలు వస్తున్నాయి. అయితే నిర్మాతగా విజయ్ కు ఈ సినిమా దాదాపు 4 కోట్లకు పైగా లాభాలు తెచ్చి పెట్టింది అని అంటున్నారు. దీనితో ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లు అందరు విజయ్ దేవరకొండ సహాయం కోసం ఎదురు చూస్తుంటే విజయ్ మాత్రం ఎవరికీ స్పందించడం లేదు అన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: