భారతీయ చలన చిత్ర సీమలో తనదైన గాత్రంలో ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన గాన గంధర్వుడు ఎస్పీ  బాలసుబ్రహ్మణ్యంకు ఓ  చేదు అనుభవం ఎదురైంది.  గాంధీ 150వ జయంతి సందర్భంగా నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన స్టార్స్‌ మీట్‌పై మరో ప్రముఖులు విమర్శలు గుప్పించారు. మోదీ ఏర్పాటు చేసిన సమావేశంలో షారుఖ్‌ ఖాన్‌, అమిర్‌ ఖాన్‌ తదితర బాలీవుడ్‌ ప్రముఖులంతా పాల్గొన్నారు. కాగా,  సౌత్‌లో అగ్రతారలకు ఆహ్వానాలు అందకపోవటంతో, కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది మంది దక్షిణాది సినీ ప్రముఖుల ఫోటోలు కూడా బయటకు రాకపోవటంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు.

ఇక ఆనాటి సమావేశంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాలసుబ్రహ్మణ్యం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. రామోజీరావుగారి రికమండేషన్‌తో నేను ఆ సమావేశంలో పాల్గొనగలిగాను. అందుకు ఆయనకు కృతజ్ఞతలు.  అయితే నా గురించి అందరికీ తెలిసినా అక్కడ మాత్రం తనకు ఘోరమైన అవమానం జరిగిందని వాపోయారు. మోదీగారి ఇంటికి చేరుకోగానే సెక్యూరిటీ సిబ్బంది నాతో సహా చాలామంది సెల్‌ఫోన్స్‌ స్వాధీనం చేసుకొన్నారు. ఫోన్లు తీసుకొని మాకు టోకెన్లు కూడా ఇచ్చారు. విచిత్రం ఏంటేంటే..లోపలికి వెళ్లే సరికి స్టార్స్‌ మోదీతో తమ సెల్‌ఫోన్లలో సెల్పీలు దిగుతున్నారు.

ఈ సంఘటన నిరుత్సాహానికి గురిచేసింది  అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి దిల్ రాజు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి కొంతమందికి మాత్రమే ప్రత్యేకంగా ఆహ్వానం అందింది.కాగా, ఈ విషయంపై  రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌ వేదికగానే మోదీ తీరుపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: