బన్నీ, సుకుమార్ కలయికను కదిలిస్తే.. సమ్మర్ కు వస్తామంటున్నారు. చిరంజీవి, కొరటాల మూవీ కూడా సమ్మర్ నే టార్గెట్ చేసింది. ప్రభాస్, రాధామోహన్ మూవీ కూడా సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది. ఇలా అందరూ.. ఏప్రిల్, మేలో ముహూర్తాలు చూసుకుంటుంటే.. సమ్మర్ సీజన్ మాత్రం ఓ యంగ్ హీరోతో మొదలవుతోంది. ఆల్ రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. 


10రోజులు సెలవులుండే సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడితే.. రెండు నెలల పాటు సెలవులుండే సమ్మర్ కు ఓ 10 క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కావడం ఖాయం. ఈ రేసులో చిరంజీవి.. బన్నీ.. ప్రభాస్ లాంటి స్టార్స్ ఉన్నారు. ఎవరు ఎపుడు వస్తారో తెలియదు. వీళ్లతో పోటీ ఎందుకనుకున్న నానీ.. మార్చిలోనే వచ్చేస్తున్నాడు. 


గ్యాంగ్ లీడర్ తర్వాత నాని నటిస్తున్న సినిమా "వి". అష్టాచమ్మాతో నానీని హీరోగా పరిచయం చేసి.. జెంటిల్ మెన్ లాంటి మరో హిట్ ఇచ్చిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో "వి" తెరకెక్కుతోంది. సోమవారం రిలీజ్ చేసిన టైటిల్ లుక్ చూస్తుంటే.. సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. జెంటిల్ మెన్ మాదిరి నాని ఇందులో నెగిటివ్ షేడ్ లో కనిపించడం కాదు.. ఏకంగా నటిస్తున్నాడని సమాచారం. హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నాడు. అదితిరావు హైదరీ, నివేద థామస్ హీరోయిన్స్ కాగా.. సైరాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు. 


నాని, సుధీర్ బాబుల "వి" మార్చి 25న రిలీజ్ అవుతోంది. గ్యాంగ్ లీడర్ ను రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడంతో.. సరిగా ఆడలేదన్న ఫీలింగ్ లేకుండా.. ఈ సారి పండుగను ఎంచుకున్నాడు నాని. గురు, శుక్రవారం కాకుండా.. పండుగ రోజే సినిమా రిలీజ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: