ఈ మద్య సూపర్ హిట్ సినిమాలు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు స్టార్ హీరోలు, దర్శక-నిర్మాతలు.  అయితే కొన్ని సీక్వెల్స్ మంచి విజయాలు అందుకుంటే.. మరికొన్ని దారుణమైన ఫలితాలను పొందుతున్నాయి. తాజాగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ‘పందెంకోడి ’ సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మాస్ హీరో విశాల్.  కోలీవుడ్ లో ఏ మూవీ చేసిన ఖచ్చితంగా తెలుగు లో డబ్ చేస్తున్నాడు విశాల్.  ఈ నేపథ్యంలో ఆ మద్య డిటెక్టీవ్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. 

ప్రస్తుతం ‘యాక్షన్ ’మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ మూవీలో విశాల్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్, మిస్కిన్ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `డిటెక్టివ్‌`.  వరుస హత్యలకు సంబంధించి ఓ మిస్టరీని ఛేదించే ఈ డిటెక్టివ్ సహచరుడిగా స్నేహ భర్త ప్రసన్న నటించాడు. విశాల్‌కు జంటగా అనూ ఇమ్మాన్యుయల్ నటించగా ఆండ్రియా నెగటివ్ రోల్‌లో నటించింది.  మర్డర్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే ఈ మూవీ చాలా సైలెంట్ గా హిట్ అయ్యింది.  ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాట ఘనవిజయాన్ని సాధించి విశాల్ కెరీర్‌లోనే తొలివారం వసూళ్ళలో రికార్డ్ సృష్టించింది.  

మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయ్యింది.  తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ స్టార్ట్ అయ్యింది.యూర‌ప్‌లోని బ్రిస్టోల్‌లో సోమ‌వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలయ్యింది. ఈ సినిమాలో విశాల్ హీరోగా న‌టిస్తూనే సినిమాను నిర్మిస్తున్నారు. కాగా,  తొలి షెడ్యూల్ 40 రోజుల పాటు బ్రిస్టోల్‌లో జరుపుకోనున్నట్లు సమాచారం.  ఈ మూవీకి ఇళ‌యరాజా సంగీతం అందిస్తున్నారు.  నిరవ్‌షా సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇక విశాల్ సరసన అశ్యా హీరోయిన్‌గా న‌టిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: