విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాణరంగంలోకి దిగిన విజయ్ తరుణ్ భాస్కర్ హీరోగా "మీకు మాత్రమే చెప్తా" అనే సినిమాని నిర్మించాడు. అయితే శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. షామీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్ ని బాగానే ఆకర్షించినప్పటికీ టాక్ పరంగా మాత్రం యావరేజ్ అని పేరు తెచ్చుకుంది.


అయితే ఈ సినిమా చూసినవారందరూ కామెడీ బాగానే ఉందని చెప్తున్నారు. కాకపోతే ఈ సినిమా షార్ట్ ఫిలిమ్ కి ఎక్కువ..ఫీచర్ ఫిలిమ్ కి తక్కువగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అస్సలు బాగాలేవని చెప్తున్నారు. ఈ విషయాన్ని విమర్శకులు తమ రివ్యూలలో ప్రస్తావించారు. సాధారణ ప్రేక్షకులు కూడా చాలామంది అలానే అభిప్రాయ పడ్డారు.  సినిమా చూస్తే రెండు కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ అయి ఉండదనే టాక్ వినిపించింది. 


బిజెనెస్ కోసమే విజయ్సినిమా బడ్జెట్ ను పెంచి చెప్పాడని కూడా కామెంట్లు వినిపించాయి.  ఇదే విషయంపై రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో విజయ్ ఫాదర్ వర్ధన్ దేవరకొండ ను ప్రశిస్తే.. ఆయన నిర్మాణ విలువల్లో ఏమాత్రం రాజీపడలేదని సినిమాను వెనకేసుకొచ్చారు. 'మీకు మాత్రమే చెప్తా' సినిమాకు దాదాపు రూ. ఐదు కోట్లు ఖర్చుపెట్టామని.. ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేదని అన్నారు.   


టెక్నికల్ ఏర్పడిన ఇష్యూ కారణంగా విజువల్స్ కాస్త డల్ గా కనిపిస్తున్నాయని చెప్పారు.   అదీ గాక డీఐ చేసే సమయంలో ఏర్పడిన సమస్య కూడా ఒక కారణమని.. ఎక్కువ సీన్ల ను నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించడం వల్ల కూడా అలా అనిపించి ఉంటుందని, అంతేకానీ సినిమా ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీపడలేదని, మంచి సినిమాని ప్రేక్షకులకి అందించడానికి మా శాయశక్తులా ప్రయత్నం చేసామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: