జబర్దస్త్ కామెడీ షో కి జడ్జి అయినా నాగబాబు తన అన్నయ్య చిరంజీవి ని తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని బాగా ప్రేమిస్తారు. అతని అన్నయ్య తమ్ముడు కూడా నాగబాబు ని బాగానే చూసుకుంటారు. ఆర్థిక సమస్యలతో తకమక అవుతున్న నాగబాబు ని అతని అన్నతమ్ములు ఎంతో ఆదుకున్నారని చాలా సందర్భాల్లో చెప్పారు ఈ మెగాబ్రదర్. అయితే ఇలా ఎంతో ప్రేమానురాగాలతో ఉండే మెగాబ్రదర్స్ జీవితాలలో కూడా మందలింపులు ఉన్నాయంటే నమ్ముతారా? 


అవునండి! తన అన్నయ్య మెగాస్టార్ గురించి ఎపుడూ మంచి మాటలు చెప్పే నాగబాబు ని చిరంజీవి ఒకరోజు కొట్టారంట. వివరాల్లోకి వెళ్తే.... ఈ సంఘటన చిరంజీవి 12వ తరగతి నాగబాబు 7వ తరగతి చదివే సమయంలో జరిగిందని చిరు ఈ రహస్యాన్ని బయటపెట్టారు. ఒక సందర్బంలో తన తమ్ముడైన నాగబాబుని తన మాట వినకపోతే కొట్టానని చిరంజీవి చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో ప్రతి పనిని తానే చేసేవాడినని కానీ నాగబాబు కి ఒక చిన్న పని చెపిన చేయకపోవడంతో రెండు దెబ్బలు వేశానని చెప్పారు చిరంజీవి.


అక్కడే ఉన్న చిరంజీవి అమ్మ అది చూసి, చిన్నపిల్లడ్ని చేసి ఎందుకు కొడుతున్నావురా అని మందలించిందని చిరు చెప్పారు. ఇంటికి రాగానే జరిగిందంతా తన నాన్న కి చెప్పడంతో వాళ్ళ నాన్న నాగబాబు ని తిట్టారని, దానితో చిరు శాంతించారని చెప్పుకొచ్చారు ఈ సైరా స్టార్. 


ఇక సినిమాల విషయాలకి వస్తే, తన 151వ సినిమా సైరా నరసింహ రెడ్డి తో బాక్స్ ఆఫీస్ బద్దలుకొట్టిన మెగాస్టార్ తన 152వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు అటు జబర్దస్త్ లో న్యాయమూర్తిగా ఇటు పవన్ కళ్యాణ్ కి రాజకీయ సలహాదారుడిగా సమయాన్ని గడుపుతున్నారు. అవకాశమొచ్చినపుడల్లా సినిమాల్లో తన నటన ప్రతిభతో తెలుగు అభిమానులను అలరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: