బాలీవుడ్ బాద్ షా అంటే షారుఖ్ ఖాన్ కళ్లముందు కనిపిస్తాడు. కానీ.. ఇప్పుడీ హీరో గుర్తుకు రావడం లేదు. ఎందుకంటే షారుఖ్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతోంది. మరో సినిమా సెట్స్ పైకి రాలేదు కదా.. అసలు క్లారిటీనే లేదు. పుట్టిన రోజు సందర్భంగా తర్వాతి మూవీ ఎనౌన్స్ చేస్తాడనుకుంటే.. హ్యాండ్ ఇచ్చాడు షారుఖ్. 


బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఐదేళ్ల నుంచి ఫ్లాపుల్లో ఉన్నాడు. 2014లో వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ కమర్షియల్ గా ఒకే అనిపించుకున్నా.. ఆ తర్వాత వరుస ఫ్లాపులు వెంటాడాయి. దిల్ వాలే.. ఫ్యాన్.. డియర్ జిందగీ.. జబ్ హారీమెట్ సెజల్.. జీరో లాంటి ఫ్లాపులు షారుఖ్ ను భయపెట్టాయి. 


షారుఖ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న జీరో ఫ్లాప్ అయ్యింది. ఎంత కష్టపడి నటించిన మరగుజ్జు పాత్ర పేరు తీసుకొస్తుందని ఆశించాడు. జీరో 2018 డిసెంబర్ లో రిలీజ్ కాగా.. షారుఖ్ ఇంతవరకు తర్వాతి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మధ్యలో చాలా కాంబినేషన్స్ తెరపైకి వచ్చినా.. ఒక్కటీ సెట్ కాలేదు. 


షారుఖ్ సినిమా దర్శకుడిగా అట్లీ పేరు వినిపిస్తోంది. విజయ్ తో తీసిన విజిల్ దీపావళికి రిలీజ్ కాగా.. దర్శకుడు షారుఖ్ ను డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 2న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారని ఫ్యాన్సే కాదు.. బీటౌన్ కూడా భావించింది. అయితే.. అలాంటిది ఏమీ లేకపోయినా.. అట్లీ దంపతులు షారుఖ్ ను కలిసి విషెస్ తెలియజేశారు. ఫోటో కూడా దిగారు. ఈ లెక్కన షారుఖ్ తర్వాతి మూవీని అట్లీనే తీస్తాడన్న వార్తకు ఈ ఫోటో బలం చేకూర్చినట్టయింది. విజయ్ తో తీసిన మెర్సల్ ను షారుఖ్ తో తీస్తాడన్న టాక్ నిజమవుతుందో.. లేదంటే.. కొత్త ప్రాజెక్ట్ తో వస్తాడో చూడాలి. మెర్సల్ తెలుగులో అదిరిందిగా పేరుతో రిలీజై.. ఇక్కడ కూడా విజయం సాధించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: