ఇటీవల మంచి జోష్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3, ఎట్టకేలకు నిన్న ముగిసిన విషయం తెలిసిందే. ఫైనల్ రోజున మొత్తం ఐదుగురు సభ్యులు హౌస్ లో మిగలగా, వారిలో ముగ్గురు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయి చివరిగా శ్రీముఖి మరియు రాహుల్ మాత్రమే హౌస్ లో మిగిలారు. అయితే వారిద్దరిలో విజేతను ఎంపిక చేయడానికి హోస్ట్ నాగార్జునతో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక అతిథిగా రావడం జరిగింది. ఇక వారిద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన రాహుల్ ని విజేతగా ఎంపిక చేసి, మెగాస్టార్ చేతుల మీదుగా అతడికి రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్ తో పటు బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ ని అందించడం జరిగింది. 

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, చివరిలో వోటింగ్ సమయానికి రాహుల్ మరియు శ్రీముఖి మధ్య విపరీతమైన నెలకొందని, ఇక నాగార్జున గారు స్టేజి మీద చెప్పినట్లుగా మొత్తం ఫైనల్ సందర్భంగా పోలైన 8.5 కోట్ల ఓట్లలో మెజారిటీ ఓట్లు రాహుల్ మరియు శ్రీముఖి కె వచ్చాయని అంటున్నారు. అంతేకాక వారిద్దరి మధ్య వోటింగ్ తేడా కేవలం 1.25 శాతమేనని, ఆ విధంగా చూస్తే రాహుల్ తో పాటు శ్రీముఖి కూడా ఒకరకంగా విజేతగా నిలిచినట్లే అంటూ ఒక వార్త ప్రచారం అవుతోంది. అయితే కొద్దిరోజుల నుండి సాగుతున్న వోటింగ్ లో ఒక రోజు రాహుల్ కు ఎక్కువ ఓట్లు వస్తే, 

మరొకరోజు శ్రీముఖికి ఎక్కువ వచ్చాయని, ఇక అది ఫైనల్ దశకు చేరుకునే సరికి, కేవలం అత్యల్ప స్థాయి ఓట్ల మెజారిటీతో రాహుల్ ముందంజలో ఉండడంతో అతడు విజేతగా ఎన్నికయ్యాడని అంటున్నారు. అయితే శ్రీముఖి రన్నరప్ గా నిలిచినప్పటికీ కూడా ప్రేక్షకుల హృదయాలు దోచుకుని మంచి పేరు సంపాదించడం జరిగిందని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా చివరిగా ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే విజేత అవుతారు కాబట్టి, ఆ విధంగా రాహుల్ ఫైనల్ విన్నర్ గా ఎంపికయ్యారని అంటున్న వారు కూడా లేకపోలేదు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: