బ్లాక్ బ‌స్ట‌ర్ బ్యూటీ ఫొటో షూట్స్‌తో టైంపాస్ చేస్తుంది. స‌క్సెస్‌తో కెరియ‌ర్ ఊపందుకుంటుంది అనుకుంటే సీన్ రివ‌ర్స్ అవుతుంది. ఇక ఈ భామ ఖాళీగా ఉండ‌డంతో ఏమీ తోచ‌క హాట్ హాట్ ఫొటోషూట్‌తో మేక‌ర్స్‌కి గాలం వేస్తోంది. మ‌రి ఈ ఘాటు ఫొటో షూట్స్ ఈ బ్యూటీకి అవ‌కాశాలు తెచ్చిపెడ‌తాయా లేదా అన్న‌ది చూడాలి. ముంబ‌యి బ్యూటీ నిధిఅగ‌ర్వాల్ టైం బ్యాడ్ అన్న‌ట్లే ఉంది. క్రేజీ ఛాన్స్‌లే కాదు క్రేజీ స‌క్సెస్‌లు కూడా ఈ బ్యూటీ ఫేక్‌ను మార్చ‌లేక‌పోయింది. నాగ‌చైత‌న్య న‌టించిన స‌వ్య‌సాచి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచినా అక్కినేని మ‌రో కుర్ర‌హీరో అఖిల్‌తో క‌లిసి మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రంలో న‌టించింది. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. తాను న‌టించిన తొలి రెండు సినిమాలు నిరాశ ప‌రిచాయి. అయితే ఇటీవ‌లె పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్ లో అవ‌కాశం ద‌క్కించుకుంది.


 ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ స‌క్సెస్ సాధించింది. ఈ చిత్రంలో నిధి వ‌ల‌క‌బోసిన వ‌య్యారాల‌కు కుర్ర‌ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. ఈ భారీ స‌క్సెస్‌తో నిధి అవ‌కాశాలు కుప్ప‌లు తెప్ప‌లుగా ప‌డ‌తాయి అనుకుంది. కానీ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం కూడా నిధి ఫేట్‌ని మార్చ‌లేక‌పోయాయి. ఇక అవ‌కాశాలు లేక ఈ భామ ఫొటో షూట్‌తో టైంపాస్ చేస్తుంది. లేటెస్ట్‌గా తాను ప‌సుపు రంగు నైట్ సూట్‌లో చేసిన ఫొటో షూట్‌లో త‌న అందాల‌తో వేడెక్కించేస్తుంది. కొన్నాళ్ళుగా నిధి ఈ హాట్ ఫొటో షూట్‌తో మేక‌ర్స్‌కి గాలం వేస్తుంది. అమ్మ‌డు ప్లే చేస్తున్న ఈ ట్రిక్స్ ఏమ‌న్నా కొత్త ఛాన్స్‌లు తెచ్చిపెడ‌తాయేమో చూడాలి మ‌రి. ప్ర‌స్తుతం ఈ భామ కోలీవుడ్‌లో జ‌యంర‌వికి జంట‌గా జ‌యం చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: