ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ –బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ కాంబోలో ఒక సినిమా రాబోతోందని అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ లో భారీగా ప్రచారం ఉంది. వరస ఫ్లాపుల్లో ఉన్న షారూక్ కు యమా అర్జెంట్ గా హిట్ ఇచ్చే దర్శకుడు కావాలి. ఆ  అవకాశం తమిళ దర్శకుడు అట్లీకి దక్కనుందనే ప్రచారం సాగుతోంది. అయితే అట్లీ ఇటీవల తమిళం లో రిలీజైన సినిమా కూడా రొటీన్ గా..సో..సో.. అనిపించి అంతగా సక్సస్ కాలేదు. ఈ నేఫథ్యంలో అతడికి షారూక్ ఏ మేరకు ఛాన్స్ ఇస్తాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసలే ఫ్లాపుల్లో బాద్‌షా కి మళ్ళీ ఫ్లాప్ పడితే మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అవుతుంది పరిస్థితి. 

అందుకే అట్లీ తో చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారట. అట్టీ-షారూక్ ల నడుమ చర్చలు చాన్నాళ్లుగానే సాగుతున్నాయని తెలుస్తోంది. అయితే సినిమా  ప్రకటన మాత్రం రావడం లేదు. ఇక షారూక్ బర్త్ డే వేడుకల్లో మరో సౌతిండియన్ డైరెక్టర్ మెరిశాడు. అతడే వెట్రీమారన్. ఇటీవలే తమిళ సినిమా 'అసురన్' ద్వారా మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకున్నాడు వెట్రీమారన్. ఈ నేపథ్యంలో షారూక్ పుట్టిన రోజు వేడుకల్లో ఇతడు కనిపించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ కోలీవుడ్ లో ఈ ఇద్దరి కలయిక మీదే తెగ చర్చించుకుంటున్నారు. 

వెట్రిమారన్ డైరెక్షన్లో షారూక్ హీరోగా సినిమా రాబోతోందనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అయితే ఇది కేవలం క్యాజువల్ మీటింగ్ మాత్రమే అంటూ వెట్రిమారన్ చెబుతున్నాడట. మొత్తానికి షారూక్ ఇప్పుడు సౌత్, అందులోను తమిళ దర్శకులను నమ్ముకుంటున్నట్టుగా బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయంలో మన బాద్‌షా వెంటనే క్లారిటి ఇస్తే బావుంటుంది. ఇక బాద్‌షా తన సొంత నిర్మాణ సంస్థలో ఎంతో భారీగా నిర్మించిన జీరో పెద్ద డిజాస్టర్ గా మిగిలిందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షారుఖ్ కి జంటగా కత్రినా కైఫ్, అనుష్క శర్మ నటించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: