తెలుగు సినిమా హిస్టరీలో దిల్ రాజు వంటి టాప్ డిస్ట్రిబ్యూటర్స్ కి భయంకరమైన భారీ నష్టాలు తెచ్చిన టాప్ 10 సినిమాల లిస్ట్ లో పెద్ద సినిమాలు..స్టార్స్ నటించిన సినిమాలే ఉన్నాయి. ఈ సినిమా వల్ల బయ్యర్లకు ఎంత నష్టం వచ్చిందని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ముందుగా ఈ లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన రెండు సినిమాలు.. సూపర్ స్టార్ మహేష్ నటించినవి మూడు సినిమాలు టాప్ 10 డిజాస్టర్లలో ఉండటం ఆశ్చర్యకరం. అలాగే చిరు.. ప్రభాస్ నటించిన సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. బాలయ్య చేసిన రెండు సినిమాలు డిజాస్టర్స్ టాప్ 10 లోఉన్నాయి. ఇంకో విషయం ఏమంటే బ్లాక్ బస్టర్ అన్న సినిమా కూడా నష్టాలు తెచ్చిన సినిమాల లిస్ట్ లో ఉండటం. 

ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా సాహో అన్నిచోట్లా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పటికి.. తెలుగు రాష్ట్రాలతో సహా సౌత్ లో భారీ నష్టాలను మిగిల్చింది. ఆ నష్టం దాదాపు 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఏకంగా 70.1 కోట్ల నష్టం మూటగట్టుకుంది. 65 కోట్ల నష్టాలతో మెగాస్టార్ చిరంజీవి నటించిన పాన్ ఇండియా చిత్రం సైరా ఆ తర్వాత స్థానంలో ఉంది. రిలీజైన అన్ని పరిశ్రమల్లోనూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ కలెక్షన్లలో ఊహించని ఫలితాన్ని ఎదుర్కొంది సైరా. అయితే హిందీ వసూళ్లు  తీవ్రంగా నిరాశపరిచాయని నిర్మాత రామ్ చరణ్ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. 

మహేష్ నటించిన స్పైడర్ 55 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత ఎన్బీకే నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ పార్ట్ -1  50.27 కోట్లు.. ఎన్టీఆర్ పార్ట్ 2... 47.22 కోట్లు వరకు నష్టపోయాయి.  పవర్ స్టార్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ 42 కోట్ల నష్టాలను మిగిల్చి షాకిచ్చింది. సూపర్ స్టార్ మహేష్ నటించిన 1నేనొక్కడినే 40కోట్ల నష్టాలను తేగా.. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ 37 కోట్ల నష్టాలతో చరణ్ కే కాదు బోయపాటికి గట్టి షాకిచ్చింది. ఇక మహేష్ నటించిన బ్రహ్మోత్సవం 30.4 కోట్ల నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాతో దర్శకుడు ఇప్పటివరకు మళ్ళీ కనిపించలేదు. అంతేకాదు మహేష్ కి ఈ సినిమా పెద్ద షాకిచ్చింది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: