కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ వివాదాస్పదమైన సినిమాలు తెరకెక్కించే రామ్ గోపాల్ వర్మ రాజకీయపరమైన వివాదాస్పద సినిమాలు తీస్తూ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి భార్య లక్ష్మీపార్వతి గారి గురించి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు తెలుగు రాజకీయాలలో  కలకలం సృష్టించిన రాంగోపాల్ వర్మ తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీసి సరికొత్త వివాదానికి తెరలేపారు. రెండు కులాల ఆధిపత్యం లో ఉండే రాజకీయాన్ని బేస్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సినిమాలోని క్యారెక్టర్లు వాస్తవంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు సంబంధించినవి కావడంతో రాంగోపాల్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు విడుదల చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో  పవన్ కళ్యాణ్- నారా లోకేష్ కలిసి వున్న పోస్టర్ ని రిలీజ్ చేసాడు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని కమ్మ రాజ్యం లో కడప రెడ్లు చిత్రం లోని సన్నివేశం అన్నట్లుగా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ.


పోస్టర్ విడుదల చేయక ముందు ట్రైలర్ విడుదల చేసి ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న రామ్ గోపాల్ వర్మ తరువాత కేఏ పాల్ పై పాటని విడుదల చేసి తెలుగు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. ట్రైలర్ లో నారా లోకేష్ కి చంద్రబాబు పప్పు వడ్డించే సన్నివేశం చాల పాపులర్ అయింది. అయితే ఇపుడు విడుదల చేసిన పోస్టర్ నారా లోకేష్ ని పవన్ కళ్యాణ్ ఓదారుస్తున్నట్లు వుంది. దీంతో ఈ పోస్టర్ పోస్ట్ చూసిన మెగా అభిమానులు రామ్ గోపాల్ వర్మ పై మండిపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: