టాలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క పేరు ప్రతిష్టలు ఒకప్పటితో పోలిస్తే ఇటీవల ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అనే చెప్పాలి. కొత్త కొత్త నటీనటులు మరియు దర్శకులు, కథకులు వంటి వారి రాకతో సినిమా పరిశ్రమలో రకరకాల కొత్త రకమైన చిత్రాల రాకతో పాటు, వాటి వలన మరింత మంచి పేరు మరియు ఆదరణ లభిస్తోంది. ఇక ఇటీవల రాజమౌళి తీసిన బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా రూపురేఖలు మరియు బౌండరీలు పూర్తిగా మారిపోయాయి అనే చెప్పాలి. ఇక ఆ తరువాత నుండి ఒకింత భారీ బడ్జెట్ సినిమాల రాక కూడా నెమ్మదిగా పెరుగుతోంది. అయితే వాటితో పాటు ఫ్లాప్ సినిమాల సంఖ్య కూడా ఒకింత పెరుగుతూ నిర్మాతలను కలిచి వేస్తోంది. ఇకపోతే ఇటీవల విడుదలై, టాలీవుడ్ లోనే అతి పెద్ద డిజాస్టర్ చిత్రాలుగా నిలిచిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఇటీవల బాహుబలి రెండు భాగాల సూపర్ సక్సెస్ తరువాత ప్రభాస్ నటించిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ సాహో, కొద్దిరోజుల క్రితం ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి పెద్ద ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా ఓవర్ అల్ గా రూ. 80 కోట్ల మేర అత్యధిక నష్టాలు తెచ్చిన తెలుగు సినిమాగా ప్రధమ స్థానంలో నిలిచింది. ఇక ఆ తరువాత గత ఏడాది పవర్ స్టార్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఘోరమైన ఫ్లాప్ టాక్ ని మూటగట్టుకుని నిర్మాతలకు ఏకంగా రూ.70.5 కోట్ల నష్టాలు తెచ్చిపెట్టి రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఆ తరువాత ఇటీవల మెగాస్టార్ మరియు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా మంచి టాక్ సంపాదించినప్పటికీ, మెల్లగా రోజురోజుకు దారుణమైన కలెక్షన్స్ పొందుతూ ముందుకు సాగింది. ఇక నార్త్ లో అయితే ఈ సినిమా
దారుణమైన పరాజయాన్ని అందుకుని అక్కడి బయ్యర్లకు తీవ్ర సమస్యలు తెచ్చిపెట్టింది. ఇకపోతే ఓవర్ ఆల్ గా ఈ సినిమా రూ.65 కోట్ల మేర నష్టము తెచ్చిపెట్టి మూడవ స్థానంలో ఉంది. 

అనంతరం సూపర్ స్టార్ మహేష్ మరియు మాస్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు  మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ఫ్లాప్ సినిమా స్పైడర్ రూ.55 కోట్లు, అలానే దాని తరువాత బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు రూ.50 కోట్ల మేర నష్టం తెచ్చిపెట్టడం జరిగిందట. అయితే వీటి తరువాత వరుసగా ఎన్టీఆర్ మహానాయకుడు, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్  సింగ్, మహేష్ బాబు వన్ నేనొక్కడినే, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బోయపాటి కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయరామ సినిమాలు నిలిచినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. కాగా ఈ సినిమాల పరాజయాల తరువాత రాబోయే కాలంలో నిర్మాతలు కాస్ట్ కంట్రోల్ విషయమై కొంత శ్రద్ధ తీసుకోవడంతో పాటు, సినిమాలోని కథ మరియు కథనాలు ప్రేక్షకుడిని ఎంతవరకు ఆకట్టుకుంటాయి అనే విషయాలపై మరింత శ్రద్ధ పెడితే, భవిష్యత్తులో ఈ విధంగా నష్టాలు వచ్చే అవకాశం కొంత తగ్గుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: