బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నుండి అలియా భట్, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


2020 జూలై 30 రిలీఎజ్ అంటూ ఎనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం పరిస్థితులు చూస్తే రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రీసెంట్ గా సైరా ప్రమోషన్స్ లో రాం చరణ్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ వాయిదా వార్తలను ఖండించారు. ఇదిలాఉంటే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఇద్దరు హీరోలకన్నా హైలెట్ అయ్యే అంశం మరోటి ఉందట.


అది ఏంటో కాదు సినిమా కథ. విజయేంద్ర ప్రసాద్సినిమా కథను చాలా అద్భుతంగా రాశారట. అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ ఇద్దరు తమ నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు మాటలను అందిస్తున్న సాయి మాధవ్ బుర్ర చెప్పిన దాని ప్రకారం చూస్తే సినిమాలో తారక్, చరణ్ ఇద్దరు స్టార్స్ ఉన్నా కథే హైలెట్ గా ఉంటుందని చెబుతున్నాడు.


రీసెంట్ గా మెగాస్టార్ నటించిన సైరా సినిమాకు డైలాగ్స్ రాశాడు సాయి మాధవ్ బుర్ర. కృష్ణవం వందే జగద్గురుం సినిమాతో ఈయనకు మంచి పేరు వచ్చింది. అప్పటినుండి వరుస సినిమా ఛాన్సులు అందుకుంటున్నారు. రాజమౌళి సినిమాకు మాటలు రాయడం చాలా కష్టం. అయితే సాయి మాధవ్ మాత్రం కష్టమంతా రాజమౌళి తీసుకుని తన పని సులువుగా అయ్యేలా చేస్తాడని జక్కన్న మీద ప్రశంసలు కురిపించాడు. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగా వస్తుందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: