అన్ని వివాదాలు స‌బ్జెక్టులు అయిపోయి ప్ర‌స్తుతం సొసైటీలో ఉన్న కులాల  పైన  ప‌డ్డాడు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ్‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో జ‌రిగిన చిన్న చిట్ చాట్‌...  ఒక ద‌ర్శ‌కుడుగా నేను ఒక స‌బ్జెక్ట్‌ని అనుకున్నానంటే అది ప‌బ్లిక్ మీద‌, మీడియా వాళ్ళ‌తో మాట్లాడుతున్న‌ప్పుడు నాకు ఎక్కువ‌గా క‌నిపించే అంశం కులాల మీద క‌న‌ప‌డుతుంది. అందుకే నేను నా చిత్రంలో క్యాస్ట్ ఫీలింగ్ అనే పాట‌ను కూడా పెట్టాను. నాకు తెలిసి మొద‌టినుంచి ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌నిదేమిటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే త‌ప్పేంటో తెలియ‌డం లేదు. కులం గురించి ప్ర‌స్ధావ‌న లేని స‌మాజాన్ని ఎందుకు చూడాలి. మ‌న సొసైటీలో ప్ర‌తి దానికి ఒక ఐడెంటీటి అనేది ఉంటుంది. కులం, మ‌తం, రంగు ఇలా ఏదైనా కావొచ్చు.  క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు అనే టైటిల్‌లోగాని ట్రైల‌ర్‌లోగాని నేను ఎక్క‌డా కూడా వీరిద్ద‌రూ క‌లిసి కొట్టుకుంటారా లేదా లేదంటే వారిద్ద‌రూ క‌లిసి అస‌లు ఏం చేస్తున్నార‌నేది నేను అస‌లు క‌మిట్ అవ్వ‌లేదు. ట్రైల‌ర్‌లో కొంత వైల‌న్స్ అనేది చూపించాం. ట్రైల‌ర్‌లో చూపించిన వైలెన్స్‌లో రాజులు కావొచ్చు, బ్రాహ్మ‌లు కావొచ్చు క‌మ్మ‌లు రెడ్లు అని నేను చెప్ప‌లేదు. ఒక స‌బ్జెక్ట్ ని ఎన్నుకోవ‌డంలో యాజ్ ఎ ఫిల్మ్ మేక‌ర్‌గా ఇట్స్ మై రైట్ అని అంటున్నారు. 


మీడియాతో పెట్టుకున్న రామ్‌గోపాల్ వ‌ర్మ్ ఫ‌స్ట్ పాట‌లో మీడియాను కూడా ఆయ‌న విమ‌ర్శించారు. దాని గురించి వ‌ర్మ్‌ను విలేక‌రి ప్ర‌శ్నించ‌గా మీరు న‌న్ను ఎలాగైతే అంటారో నాకు మిమ్మ‌ల్ని అనే రైట్ ఉంది అని అన్నారు. ఇది ఒక పొలిటిక‌ల్ చిత్రం. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనేది పొలిటిక‌ల్ చిత్రం కాదు. ఎన్టీఆర్ చివ‌రి క్ష‌ణాల్లో గ‌డిపిన విష‌యాల‌ను మాత్ర‌మే తెలియ‌జేశాను. ఇది ఏ రాజ‌కీయ నాయ‌కుడ్ని ఉద్దేశించి తీసిన చిత్రం కాదు. ప్ర‌స్తుతం ఏపీలో ఉండే రాజ‌కీయ ప‌రిణామాల పై చిత్రీక‌రించిన చిత్ర‌మిది. ఇక్క‌డ వ్య‌క్తులకు సంబంధం లేదు కేవ‌లం సిట్యువేష‌న్ మాత్ర‌మే క‌థ‌. నిజంగా ఎవ‌ర్నీ ఉద్దేశించి తీసిన చిత్రం కాద‌ని కావాలంటే కేఏ పాల్ మీద ఒట్టేసి చెబుతానని చ‌తుర‌త‌గా అన్నారు. ఒక‌సీన్‌లో లోకేష్ పాత్ర‌కి తండ్రి ప‌ప్పు వ‌డ్డిస్తారు అని అడ‌గ‌గా ప‌ప్పు ఒడ్డించ‌డంలో ప్రాబ్ల‌మ్ ఏమిటి అని అన్నారు. నేను రాజ‌కియాల్లోకి రావ‌డానికి నాకు క‌ల్‌మ‌షం లేదు కాని నేను చాలా స్వార్ధ‌ప‌రుడ్నినేను ప్ర‌జ‌ల కోసం కాని ఎవ్వ‌రి కోసం కాని ఏమీ చెయ్య‌ను. నేను కేవ‌లం నాకోసం నేను చేసుకుంటా. ఒక రాజ‌కీయ నాయ‌కుడు డెశిష‌న్ ఏమిటి ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాలి. అలాంటి ఉద్దేశం నాకు అస‌లు లేదు . తెలంగాణ‌లో క్యాస్ట్ ఏమిటి అనేది నాకు అస‌లు తెలియ‌దు. కేసీఆర్ వెల‌మ క్యాస్ట్ అంటున్నారు కాబ‌ట్టి నాకు వెల‌మ క్యాస్ట్ ఇష్ట‌మే. బేసిక్‌గా నాకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం. మెగాఫ్యామిలీ అంటే నాకు చాలా అభిమానం అందుకే కొంత ట్వీట్లు ఎక్కువ‌గా పెడ‌తాను త‌ప్ప ఆయ‌న‌తో ప్ర‌త్యేకించి విభేధించేది ఏమీ లేదు. మెగా ఫ్యామిలీ అమెరికా లాంటిది. ప‌వ‌న్ చాలా సిన్సియ‌ర్ ప‌ర్స‌న్ నేను ఆయ‌న స్పీచ్‌ల‌నుఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాను అని ముగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: