బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది.. కింగ్ నాగార్జున హోస్ట్ గా నిర్వహించిన ఈ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఫినాలేకి రావడం కూడా షోకి చాలా ప్లస్ అయ్యింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ను గెలిచాడు రాహుల్ సిప్లిగంజ్. సింగర్ గా ప్రైవేట్ ఆల్బంస్ చేస్తూ సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ వారి ఓటింగ్స్ తోనే బిగ్ బాస్ టైటిల్ అందుకున్నాడు.


ఇదిలాఉంటే సీజన్ 3 లో రన్నరప్ గా నిలిచింది శ్రీముఖి. విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నా ఓటింగ్ ప్రకారం కాబట్టి శ్రీముఖి కన్నా రాహుల్ కొన్ని ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నాడు. అయితే విన్నర్ అయిన రాహుల్ ముందు అనుకున్న విధంగా రెమ్యునరేషన్ తో పాటుగా 50 లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు.


కాని ఈ సీజన్ లో క్రేజీ కంటెస్ట్స్ గా హౌజ్ లోకి వెళ్లిన శ్రీముఖి, వరుణ్ సందేష్ లకు వారం వారం రెమ్యునరేషన్ పెరుగుతూ వచ్చింది. టైటిల్ విన్ అయిన రాహుల్ కు 50 లక్షలు రాగా శ్రీముఖిం వరుణ్ లకు టైటిల్ గెలవకున్నా సరే రెమ్యునరేషన్ కోటి దాకా అందుకున్నారని తెలుస్తుంది. బుల్లితెర స్టార్ యాంకర్ గా శ్రిముఖి 3 నెలల పాటు తన డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని షోలో పాల్గొంది. 


ఇక ఇదేవిధంగా వరుణ్ సందేష్ కు రెమ్యునరేషన్ భారీగా అందాయని తెలుస్తుంది. వరుణ్, వితిక ఇద్దరి జోడీ బాగా అలరించింది. జంటగా వచ్చినా ఇద్దరికి విడివిడిగా రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట. వరుణ్ మొదటి రోజు నుండి 105 వ రోజు వరకు ఉన్నాడు కాబట్టి అతనికి భారీగా రెమ్యునరేషన్ వచ్చిందని టాక్. సో అలా చూస్తే రాహుల్ కు ప్రైజ్ మనీతో కలిపి వచ్చింది శ్రీముఖి, వరుణ్ లకు ఇచ్చిన దానికన్నా తక్కువే అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: