నటుడిగా వెండితెరపై, రాజకీయవేత్తగా పొలిటికల్ సర్కిల్స్‌లో హవా సాగించారు డాక్టర్ మోహన్ బాబు. రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించిన ఆయన.. గతంలో టీడీపీ పార్టీలో కీలకంగా పని చేశారు. ప్ర‌స్తుతం ఫిల్మిన‌గ‌ర్ దైవ స‌న్నిధానానికి  ఛైర్మ‌న్‌గా మోహ‌న్‌బాబు ఆయ‌న సేవ‌ల‌ను అందిస్తున్నారు. మోహ‌న్‌బాబు ఇటీవ‌లె ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట‌ల‌ను తెలుసుకుందాం. ..


నేను ఎక్కువ సిన్సియ‌ర్‌గా ఉంటాను కాబ‌ట్టే ఇప్ప‌టి ద‌ర్శ‌కుల‌కు నేనంటే  భ‌యం అంటున్నారు. గ‌తంలో నాతో చేసిన ద‌ర్శ‌కులెవ‌రూ కూడా భ‌య‌ప‌డేవారుకాదు. రాజ‌మౌళి నాతో ప‌ని చెయ్య‌లేదా ఇప్పుడు ఆయ‌న ఎంత పెద్ద ద‌ర్శ‌కుడు నాతో క‌లిసి య‌మ‌దొంగ చిత్రం చేశారు. అలాగే పూరిజ‌గ‌న్నాధ్ చెయ్య‌లేదా. వీళ్ళంతా నాతో ఒక ద‌ర్శ‌కుడికి మీరు ఇంత గౌర‌వం ఇస్తారా అని ఎంతో ఆనంద‌ప‌డేవారు. మ‌రి ఇప్ప‌టి ద‌ర్శ‌కులు నేనంటే ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు అంటే దానికి స‌మాధానం నా ద‌గ్గ‌ర లేదు అది వాళ్ళ‌నే అడ‌గాలి. ఇక‌పోతే నేను ఎప్పుడూ చెప్పిన టైంకి వ‌స్తాను. అలాగే రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో కూడా ఎప్పుడూ గొడ‌వ‌ప‌డ‌లేదు. ఇంక ఏంటి నాతో ప్రాబ్ల‌మ్‌. నా టాలెంట్ వాళ్ళ‌కు న‌చ్చొచ్చు న‌చ్చ‌పోవ‌డం  కూడా ఉంటుంది కదా కేవ‌లం మీరు భ‌యం అని ఎందుక‌నుకుంటున్నారు. కాక‌పోతే ఎక్కువ‌శాతంగా నేనే పిల్ల‌ల‌కోసం ఇక న‌టించ‌డం వ‌ద్దు అనుకున్నా విష్ణు, మ‌నోజ్ కోసం వ‌ద్ద‌నుకున్నా ఇంత‌కాలం యాక్ట్ చేశాం చాలు ఇక మ‌న‌కి అనుకున్నా. ఎడ్యుకేష‌న్ ఇనిస్టిట్యూట్స్ పెట్టాం అందులో ఎక్కువ శాతం టైం గ‌డిపుదాం మ‌న‌వ‌ళ్ళు మ‌న‌వ‌రాళ్ళ‌తో కాలం గ‌డుపుదామ‌ని నిర్ణ‌యించుకున్నా. డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్‌ని నేను చెయ్యిచేసుకున్నాను అని కొంద‌రు అన్నారు. ఆ విష‌యం సూర్య‌కిర‌ణ్ గ‌నుక మీకు డైరెక్ట్‌గా చెపితే నా యావ‌దాస్థిని మీకు ఇచ్చేస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదు. 24 క్రాఫ్ట్‌లు నాకు తెలుసు అన‌డం అవివేకం మూర్ఖ‌త్వం. ఒక‌వేళ నాకు తెలిసుంటే నాకు ఫెయిల్యూర్స్ ఎందుకు వ‌చ్చాయి. 24క్రాఫ్ట్స్‌కి క‌మాండ్ అంటే మా గురువుగారు దాస‌రినారాయణ‌రావుగారికి ఉండేది ఆయ‌న అంద‌రికీ చాలా స‌హాయ‌ప‌డేవారు. 


మోహ‌న్‌బాబు రౌడీఇజం చేసి సెటిల్‌మెంట్లు చేసి పైకొచ్చారు అన్నారు క‌దా అలాంటి ప్రూఫ్ ఒక్క‌టున్నా మీ ముందే నేను కాల్చుకుని చ‌చ్చిపోతాను. అలాంటిది నా కెరియ‌ర్ మొత్తంలో ఎక్క‌డా లేదు.  దాస‌రి గారికి, ప‌రిటాల‌ర‌వి, ర‌జ‌నీకాంత్‌కి నేను బినామి అంటున్నారు క‌దా... అయితే నా సినిమాల కోసం అప్పులు ఎందుకు చేస్తాను. అన్నం తినేవారు ఎవ్వ‌రూ కూడా అలా అన‌రు. దాస‌రినారాయ‌ణ‌రావు, కె. రాఘ‌వేం ద్ర‌రావు చాలా గొప్ప ద‌ర్శ‌కులు వాళ్ళ త‌ర్వాత నేను ప‌ని చేసిన ద‌ర్శ‌కుల్లో  కెఎస్ ఆర్ దాసు, ర‌విరాజాపినిశెట్టి, బి.గోపాల్‌ కూడా చాలా గొప్ప వార‌నే చెప్పాలి. ఇప్పుడున్న యంగ్ జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కుల‌తో చెయ్యాల‌న్న దుర‌ద అయితే మాత్రం నాకు లేదు. నేను ప‌బ్లిక్ ప్లాట్ ఫార్మ్స్‌మీద నాకు స‌న్నిహితంగా ఉన్న‌వారిని వాడు వీడు అని సంభోదిస్తాన‌ని అన్నారు. అది వాళ్ల‌కి నాకు మ‌ధ్య ఉండే సాన్నిహిత్యం కాద‌న‌డానికి మీరెవ‌రు. అలా అనుకుంటే రజ‌నీకాంత్ ఒక‌సారి రామారావుగారిని ప‌క్క‌న పెట్టుకుని న‌న్ను దొంగ‌నాకొడుకు వీడు అన్నాడు. దానికి రామారావుగారు ప‌గ‌ల‌ప‌డి న‌వ్వారు. అది స‌ర‌దాగా వాళ్ల‌కు ఉన్న ప్రేమ‌ని భ‌ట్టి అంటుంటారు దాన్ని త‌ప్పుప‌డితే ఎలా. మేం ఆత్మీయులం ఎంతో స‌ర‌దాగా మాట్లాడుకుంటుంటాం అని ఆయ‌న ఆరోజుల్లో విష‌యాల‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: