బాహుబలి వంటి భారీ విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమా వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు సినిమాపై అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీలకమైన పాత్రలో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సారి కలసి నటిస్తున్న నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీ లోనే అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా rrr అని చాలామంది ఇండస్ట్రీ లో ఉన్నవారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.


స్వాతంత్ర పోరాట నేపథ్యంలో కల్పిత కథ గా రాజమౌళి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక వైరల్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. అదేమిటంటే సినిమా కి జూనియర్ ఎన్టీఆర్..రామ్ చరణ్ లా కంటే అతి పెద్ద ప్లస్ సినిమా స్టోరీ అని అంటున్నారు. ఈ సినిమాకి స్టోరీ అందించింది విజయేంద్రప్రసాద్. గతంలో బాహుబలికి అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి దానికంటే మంచి అద్భుతంగా స్టోరీని క్రియేట్ చేసాడన వార్తలు వినబడుతున్నాయి. అంతే కాకుండా సినిమాకి మాటలు సాయిమాధవ్ బుర్రా అందించడంతో రాజమౌళి డైరెక్షన్లో విజయేంద్రప్రసాద్ స్టోరీకి సాయిమాధవ్ బుర్రా తోడైతే అది గ్యారెంటీ అద్భుతం అంటూ ఇండస్ట్రీలో చాలామంది ఈ సినిమాపై కామెంట్ చేస్తున్నారు.


వచ్చే ఏడాది జులై నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఇటీవల నార్త్ ఇండియాలో కొన్నిచోట్ల ఈ సినిమాకి సంబంధించిన పోరాట సన్నివేశాలను చిత్రీకరించిన సినిమా యూనిట్ త్వరలోనే హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ లో పాల్గొననున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: