మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర్సింహారెడ్డి చిత్రం విజ‌యం సాధించిన త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.


ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా ఓ సీనియర్‌ హీరోయిన్‌ను ఫిక్స్ చేశారు. గతంలో వీరిద్దరు స్టాలిన్‌ సినిమాలో కలిసి నటించారు. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2006లో రిలీజ్‌ అయ్యింది. ఇప్పుడు 13 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ అవుతోంది. ఇందులో హీరోయిన్ పాత్రకు త్రిష డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను కూడా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. అయితే సౌత్‌లో సూపర్‌ హిట్ అయిన సైరా, ఉత్తరాది ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. దీంతో సైరా నరసింహారెడ్డి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.


త్రిష కెరీర్ ప్రస్తుతం ఫుల్‌ ఫాంలో ఉంది. ఒక దశలో పెళ్లి చేసుకొని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని భావించిన త్రిష, ఆ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోవటంతో తిరిగి కెరీర్‌ మీద దృష్టి పెట్టింది. గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం తమిళ్‌, క‌న్న‌డ‌లో ఫుల్‌ బిజీగా ఉన్న త్రిష గర్జనై, శతురంగ వేట్టై 2, పరమపథం విలయట్టు, రాంగీ, సుగర్‌ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇక‌పోతే ఇదిలా ఉంటే కొంత మంది సీనియ‌ర్ హ‌రోయిల‌కు హీరోయిన్ దొర‌క‌డ‌మంటే కాస్త క‌ష్టంగానే ఉంది. సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లంటే ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న హీరోయిన్ల‌ను వేళ్ళ‌మీద లెక్క పెట్ట‌వ‌చ్చు. త్రిష‌, న‌య‌న్‌తార‌, త‌మ‌న్నా, కాజ‌ల్‌, అనుష్క వీళ్ళు త‌ప్పించి ఇంకెవ‌రూ సీనియ‌ర్ హీరోల‌కు పెద్ద‌గా సూట్ అవ్వ‌రు అని ప‌లువురి అభిప్రాయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: