ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోపై తాజాగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా విరుచుకుపడ్డారు. బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం​ చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించిన ఆమె.. విమాన ప్రయాణంలో తన ఖరీదైన లగేజ్‌ బ్యాగ్‌ డ్యామేజ్‌ చేశారని, బ్యాగ్‌ హ్యాండిల్‌, వీల్స్‌ విరిగిపోయాయంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు. పటిష్టమైన బ్యాగ్‌ను ధ్వంసం చేసిపారేశారంటూ ఆమె మండిపడ్డారు. మంచి బ్యాగ్‌ను తీసుకొని మీ ఇండిగో విమానంలో ప్రయాణిస్తే.. ప్రయాణం ముగిసేసరికి బ్యాగ్‌ రెండు హ్యాండిల్స్‌ విరిగిపోయానని, వీల్స్‌ పూర్తిగా ఊడిపోయానని, మీ ధాటికి సామ్‌సొనైట్‌ బ్యాగ్‌ తట్టుకోలేకపోయిందంటూ ఇండిగో సిబ్బందికి సోనాక్షి వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు.


సేవా తత్పరత లోపించిందని, ఇటీవల పలువురు సెలబ్రిటీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఎంతో గట్టిదైన తన ట్రాలీ బ్యాగ్ ను విరిచేసి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో విమాన ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాన్ని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. తన ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్, చక్రాలు ఊడగొట్టారని పేర్కొంటూ, ఫొటోలను కూడా పెట్టారు.


‘ఈరోజు ఇండిగో విమానంలో ప్రయాణించా. పర్ ఫెక్ట్ గా ఉన్న బ్యాగ్ తో నా ప్రయాణం ప్రారంభించాను. ప్రయాణం అనంతరం ఒక చక్రం ఊడగొట్టి, పూర్తిగా విరిగిపోయిన హ్యాండిల్ తో ఉన్న ట్రాలీ బ్యాగ్ ను నాకు అప్పగించారు. ధన్యవాదాలు ఇండిగో!’ అని తన సందేశంలో పేర్కొన్నారు. లగేజి పట్ల ఇండిగో సిబ్బంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని కొంతకాలంగా ప్రయాణికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన వీణను సిబ్బంది పాడుచేశారని ప్రముఖ సంగీత కళాకారుడు శభేంద్ర రావు ఫేస్ బుక్ మాధ్యమంగా విమర్శించిన సంగతి తెలిసిందే. మ‌రి ఇలాంటి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్న ప్ర‌ముఖ ఎయిర్‌లైన్స్ దీనికి ఎలాంటి సంజాయిషీ చెపుతుంది. దీని పై వారు ఎలా స్పందిస్తారు అన్న‌ది తెలియాల్సి ఉంది. ఎక్క‌డో ఒక‌సారి పొర‌పాటు జ‌రిగితే అది కామ‌న్ ప్ర‌తిసారి అదే ప‌నిగా జ‌రుగుతుంటే లోపం ఎవ‌రిలో ఉన్న‌ట్లు దాన్ని స‌రిచేసుకోడానికి కూడా ప్ర‌య‌త్నించ‌డంలేదా అంటూ కొంద‌రు అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: