తెలుగులో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. పాపులారిటీలో గానీ, టీఆర్పీ లో గానీ ఈ షో టాప్ లో నిలిచింది. తెలుగులో ఇప్పటికి మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సీజన్లలో విన్నర్ గా నిలిచిన వారిని గమనిస్తే, కొన్ని విషయాలు అర్థం అవుతున్నాయి. ముఖ్యంగా రెండవ సీజన్ నుండి ఒక కామన్ పాయింట్ కంటెస్టెంట్ ని విన్నర్ ని చేస్తుంది. అదే సింపతీ.


అవును సింపతీ వర్కవుట్ అయితేనే బిగ్ బాస్ విన్నర్లుగా ఎదుగుతున్నారు. రెండవ సీజన్ లో కౌశల్ విన్నర్ గా ఎదిగిన క్రమాన్ని పరిశీలిస్తే ఈ విషయం క్లియర్ గా తెలుస్తుంది. కౌశల్ మిగతా కంటెస్టెంట్లకి దూరం అవడంతో ప్రేక్షకులు అందరూ అతనికి దగ్గర కాసాగారు. కంటెస్టెంట్లు అతన్ని ఒక్కడిని చేయడంతో మేమున్నాం అంటూ కౌశల్ ని గెలిపించారు. ఈ సీజన్ లో కూడా అలానే జరిగింది. రాహుల్ మొదటి నుండి ఫైనల్ వరకు వస్తాడని ఎవరూ ఊహించలేదు.


అయినా టైటిల్ గెలుచుకున్నాడంటే దానికి కారణం..శ్రీముఖి రాహుల్ ని టార్గెట్ చేయడమే. శ్రీముఖి రాహుల్ ని టార్గెట్ ని చేసే కొద్దీ అతనికి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ప్రతివారం నామినేషన్లలో పెట్టే కొద్దీ అతని ఫాన్‌ బేస్‌ స్ట్రాంగ్‌ అవుతూ వచ్చింది. నాలుగైదు వారాల వరకు రాహుల్‌ అసలు సోదిలో కూడా లేడు కానీ ఆ తర్వాత మాత్రం అతని వెంట ఎవరుంటే వాళ్లంతా సేఫ్‌ అయ్యే లెవల్‌కి ఎదిగిపోయాడు. 


అతని వల్ల వరుణ్‌ ఫాలోయింగ్‌ పెరగడమే కాకుండా పునర్నవి కూడా ఎక్కువ రోజులు వుండగలిగింది. ఈ రెండు సీజన్ల వల్ల సింపతీ వర్కవుట్ అవుతుందనే విషయం క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక వచ్చే సీజన్లలో ఈ విషయం ఎవరైతే గుర్తించుకుంటారో వారే బిగ్ బాస్ విన్నర్ గా అయ్యే అవకాశం ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: