‘బిగ్ బాస్ 3’ సీజం ముగిసిపోయినా ఆ షోకు సంబంధించిన వార్తల హడావిడి కొనసాగుతూనే ఉంది. రాహుల్ ‘బిగ్ బాస్ 3’ విన్నర్ గా మారడంలో పునర్నవి రాహుల్ ల ప్రేమకు సంబంధించిన లీకులు బుల్లితెర పై ఓపెన్ గా కనిపించడంతో బుల్లితెర ప్రేక్షకులు వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారా అన్న సందేహాలలోకి వెళ్ళిపోయారు. 

దీనికితోడు ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన నాగార్జున కూడ వీరిద్దరి సాన్నిహిత్యం పై అనేకసార్లు కామెంట్స్ చేయడంతో బుల్లితెర ప్రేక్షకులు ఇది అంతా నిజం అని నమ్మి వీరిద్దరి ప్రేమకు కనెక్ట్ కావడమే కాకుండా రాహు పై క్రేజ్ ఏర్పడేలా సంఘటనలు కలిసి వచ్చాయి. ఈ పరిస్థితుల్ మధ్య తెలుస్తున్న సమాచారం మేరకు వరుణ్ సందేశ్ తన ఇంటిలో నిన్న రాత్రి రాహుల్ కు డిన్నర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ డిన్నర్ కు రాహుల్ తో పాటు పునర్నవి అలీ రెజా లతో పాటు వరుణ్ సందేశ్ సన్నిహితులు మరికొందరు ఈ డిన్నర్ పార్టీకి వచ్చినట్లు తెలుస్తోంది. చాల సరదాగా సాగిన ఈ పార్టీలో వరుణ్ సందేశ్ రాహుల్ పునర్నవిల వైపు చూస్తూ వారి పై వచ్చిన వార్తలు నిజం చేసి నిజమైన ప్రేమికులు లా మారిపోండి అని జోక్ చేసినప్పుడు షాకింగ్ రిప్లయ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

తాను ఒక వ్యక్తి ప్రేమలో ఇప్పటికే ఉన్నానని ఆ వ్యక్తి వివరాలు తరువాత చెపుతాను అని అంటూ తన పై రాహుల్ ను ఆశలు పెట్టుకోవద్దని చెప్పినట్లు సమాచారం. దీనితో పునర్నవి రాహుల్ ను ఆటపట్టించడానికి అలా చెప్పిందా లేదంటే నిజంగానే పునర్నవి మరొకరి ప్రేమలో ఉందా అన్న సందేహాలు నిన్నటి డిన్నర్ పార్టీకి వచ్చిన చాలామందికి వచ్చినట్లుగా వార్తలు హడావిడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: