నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా వి. అష్టా చమ్మ, జెంటిల్మెన్ తర్వాత నాని మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. అందుకే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. 


అయితే అన్ని సినిమాల్లో నెగటివ్ రోల్ అంటే విలన్ గా చూపించి తర్వాత మారిన మనిషిగా మారడమని అనుకున్నారు. కాని ఈ సినిమాలో నాని సైకోగా కనిపిస్తాడట. నాని నటన చూసి అందరు సర్ ప్రైజ్ అవడం ఖాయమని అంటున్నారు. సైకో లుక్ లో నాని షాక్ ఇస్తాడని తెలుస్తుంది.


తన ప్రతి సినిమా స్పెషల్ గా ఉండాలనుకునే నాని ఈ ఇయర్ జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక రాబోతున్న వి సినిమా కూడా అలానే అంచనాలను మించేలా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నానితో పాటుగా మరో హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. సినిమాలో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 


నాచురల్ స్టార్ నాని నట విశ్వరూపం చూపించేలా ఈ సినిమా ఉంటుందట. సినిమాలో నాని సైకో లుక్ తో పాటుగా అతని అభినయం కచ్చితంగా ఫ్యాన్స్ ను అలరించేలా ఉంటుందని తెలుస్తుంది. మార్చి 25న ఉగాది సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత నాని శివ నిర్వాణ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. శివతో కూడా నిన్నుకోరి సినిమా చేసి హిట్ అందుకున్నాడు నాని. మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. శివ నిర్వాణ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: