మొట్ట మొద‌టి తెలుగు రియాల్టీ షోగా వ‌చ్చింది బిగ్‌బాస్‌. అప్ప‌టికే ప‌లు భాష‌ల‌లో షో సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో తెలుగులో కూడా మొద‌లుపెట్టారు నిర్వాహాకులు. బిగ్‌బిస్ మొద‌టి షోకు ఎన్టీఆర్‌ను వ్యాఖ్య‌త‌గా తీసుకోవడంతో  షోపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంద‌రి అంచ‌నాల‌ను నిజం చేస్తు బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌ను విజ‌యవంతం చేశాడు ఎన్టీఆర్‌.


 తన స్టార్ స్టేటస్ పక్కన బెట్టి, అందరితో కలిసిపోతూ తారక్ ‘బిగ్‌బాస్’ కార్యక్రమాన్ని నడిపించిన తీరు... విమర్శకులను సైతం మెప్పించింది. రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహారించారు. మొదట నాని హోస్టింగ్‌పై అనేక రకాల విమర్శలు వచ్చాయి. అయితే వాటిని ఎదుర్కుంటూనే తనను తాను మార్చుకుని షో కంప్లీట్ చేశాడు నాని. నాగార్జున.. బిగ్‌బాస్ 3 సీజన్ ‌ను ఎలా న‌డిపిస్తార‌నే దానిపై మొద‌ట అంద‌రిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాని ఆయ‌న ఎంతో స‌మ‌ర్ధ‌వంతంగా సీజ‌న్ 3 ను కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఈ బిగ్‌బాస్ గురించి మీకు తెలీని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇక్కడ తెలుసుకోండి.


మొట్ట‌మొద‌టిసారిగా ఈ షోను నెద‌ర్లాండ్స్‌లో దెమోల్ అనే మీడియా ప్రారంభించింది. ఇందులో బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి పాల్గొని విజ‌యం సాధించ‌డం అనేది మ‌న దేశానికే గ‌ర్వ‌కార‌ణం అయింది. ఈ షోను తొలిసారి హోస్ట్ చేసింది బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి. ఆ తర్వాత బిగ్ బ్రదర్ షోలో విన్నర్‌గా నెగ్గిన శిల్పా శెట్టిని రెండో సీజన్‌కు హోస్ట్‌గా పెట్టారు. మూడో సీజన్‌కు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు సల్మాన్ ఖానే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ మూడో సీజ‌న్ వ‌చ్చే స‌రికి ఎన్నో వివాదాల‌తో మొద‌లైంది. ముందుగా యాంక‌ర్ శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా ఈ షోపైన కంప్లైంట్ కూడా ఇచ్చారు. వీట‌న్నిటిని దాటుకుని చాలా అద్భుతంగా విజ‌యం సాధించింది ఈ షో. ఇక ఈ విష‌యం ఇలా ఉంటే హోస్టిం్ విష‌యం వ‌చ్చేస‌రికి నాగార్జున చాలా చ‌క్క‌గా చేశాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న ఫ‌స్ట్ ఎపిసోడ్‌తోనే నాగార్జున ఎన్టీఆర్‌, నానిల‌ను మ‌రిపించాడ‌నే చెప్ప‌వ‌చ్చే త‌న న‌వ్వుతోనే షోను సూప‌ర్‌హిట్ చేశాడు. ఇక తెలుగులో ముగ్గురిలో ఎవ‌రు బెస్ట్ హోస్ట్ అన్న విష‌యానికి వ‌స్తే ఎన్టీఆర్ త‌న‌కున్న అభినయంతో బాగానే అల‌రించారు. ఇక నాని కూడా ప‌ర్వాలేద‌నిపించుకున్నారు. నాగార్జున గురించి ప్ర‌త్యేకించి చెప్పేదేమీ లేదు. ఎవ‌రిస్టైల్లో వాళ్ళు ఈ షోను న‌డిపించారు.  


ఈ షోకు అన్ని భాష‌ల్లోనూ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కన్నడ, బెంగాలీ ప్రేక్షకులకు కూడా ఈ షో గురించి తెలుసుకున్నారు. కన్నడకు కిచ్చా సుదీప్, బెంగాలీకి మిథున్ చక్రవర్తి హోస్ట్‌లుగా వ్యవహరించారు. కన్నడలో మొదటి సీజనే హిట్ అయింది. కానీ బెంగాలీ వెర్షన్ ఫ్లాప్ అయింది. ఇక్క‌డ మ‌నకు తెలియ‌ని మ‌రో విష‌యం ఏమిటంటే నిజానికి బిగ్ ‌బాస్ షోలో పాల్గొనే సెలబ్రిటీలు వండనక్కర్లేదు, హౌస్‌ను క్లీన్ చేయనక్కర్లేదట. ఎప్పుడో ఒకసారి టాస్క్‌లో భాగంగా వండుకోవడమే కానీ వాళ్లు అసలు ఇలాంటి పనులు చేయరట. కంటెస్టెంట్స్‌కు వండిపెట్టడానికి ఓ కుక్, హౌస్ క్లీనర్ ఉంటారట. బిగ్‌బాస్ హౌజ్‌లో జరిగే ప్రతీ విషయాన్ని మనకు అన్ని ఎపిసోడ్లలో చూపిస్తామని అంటారు కానీ అంత సీన్లేదు. 24 గంటలు కెమెరాలు పనిచేసినా కొన్నింటిని మాత్రమే ఎడిట్ చేసి చూపిస్తారు. నిజానికి మనకు తెలీనివి బిగ్‌బాస్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. హౌస్‌లో కొన్నిసార్లు కొంత మంది పై కొన్ని ఎమోష‌న్స్ కూడా పుట్టుకొస్తాయి అయితే అవ‌న్నీ చాలా వ‌ర‌కు నిజం కాద‌నే చెప్పాలి.  కేవ‌లం ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చెయ్య‌డానికి ఇది కూడా ఒక ట్రిక్ ప్లే చేస్తారట‌. 



మరింత సమాచారం తెలుసుకోండి: