ప్రముఖ యాంకరైనా రష్మీ గౌతమ్ గురించి రోజూ ఏదో ఒక తెలియని విషయం బయటపడుతూనే ఉంటుంది. కానీ ఆమె ఇష్టాఇష్టాలు తెలిసిన వారు చాలా తక్కువమందే ఉంటారు. ఎందుకంటే ఆమె తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంది. ఎపుడో ఎవరో ఒక అభిమాని.. రష్మీ గౌతమ్ చాలా లావు అవుతున్నారు... అని అన్నందుకు, తనకి రుమాటిజం అనే ఆరోగ్య సమస్య ఉందని అందుకే అపుడపుడు లావెక్కుతానని తన పర్సనల్ విషయాన్నీ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తప్ప తన గురించి ఇప్పటివరకు రష్మీ గౌతమ్ ఏమి చెప్పుకోలేదు.


అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత తన వ్యక్తిగత విషయం గురించి ఇంకొక వార్త బయటకి వచ్చింది. అందేటంటే.... తెలుగులో ఎంత మంది నటులు ఉన్న రష్మీ మాత్రం కేవలం హాలీవుడ్ నటుడు నిర్మాత అయినా ఎడ్వార్డ్ థామస్ హార్డీనే ఇష్టపడుతుందంట. ఈ ఆంగ్ల నటుడు నిర్మాత అయినా ఎడ్వార్డ్ థామస్ హార్డీ ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా. లియోనార్డ్ డికాప్రియో హీరో గా నటించిన 'ది రెవెనంట్' సినిమాలో లో ఓ పాత్రలో నటించినందుకు గాను ఈ హార్డీ కీ ఆస్కార్ లభించింది. 


ఇది ఒక్కటే కాదు ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ ని అందుకున్న 'ది మాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్' ఇంకా బాగా ప్రఖ్యాత కాంచిన క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు అయినా ఇన్సెప్షన్(2010), ది డార్క్ నైట్ రైసెస్(2012), డంకిర్క్(2017) లలో నటించాడు. ఇవి కాకా మరెన్నో పాపులర్ సినిమాలో కూడా నడిచాడు హార్డీ. ఇదికాక, ఈ బ్రిటిష్ యాక్టర్ కొన్ని సినిమాలను కూడా నిర్మించాడు. హార్డీ కేవలం ఒక అద్భుతమైన నటుడే కాదు ఒక మంచి మనిషి కూడా. ఇప్పటికే అతను చాలా దానాలు చేసి బ్రిటన్ ప్రభుత్వం నుంచీ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ అవార్డ్ గెలుచుకున్నాడు. అందుకే రష్మీ కీ అతనంటే ఇష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: