అద్యాత్మక చిత్రాల రూపకల్పనలో మరియు అమ్మాయిని అందంగా చూపించడం లో అతడికి అతడే సాటి ఆయనే రాఘవేంద్రరావు.కొత్త తరాన్ని కూడా సినిమాలతో పరిచయం చేస్తూ ప్రయోగాలు చేస్తూ ప్రత్యేకంగా పాటలు మరియు డాన్సుల విషయం లో ప్రత్యేక ద్రుష్టి పెట్టి చేసే దర్శకులలో ఇతడు ముందు వరస లో ఉంటాడు. అయితే అతడు ఒక ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అల్లు అర్జున్  హీరోగా పరిచయం చేసే విషయంలో  ఒక చిత్రమైన సంఘటన జరిగిందని అది  బన్నీతో నేను చేసిన గంగోత్రి అని ఆ సినిమా అతడికి 100వ సినిమా అని చెప్పారు.

ఒక రోజు చిన్నప్పుడు రాఘవేంద్రరావు  గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలందరూ కలిసి డాన్స్ లు చేస్తున్నారు ఆ సమయం లో వాళ్లకు తెలియకుండా చాల సేపు బన్నీ డాన్స్ చూస్తూ ఉండిపోయినని అతడి డాన్స్ చాల బాగుందని సినిమా లపైనా ఆసక్తి ఉంటె నేను సినిమా తీస్తానని వాళ్ళమ్మకు అప్పట్లోనే 100  రూపాయల అడ్వాన్స్ ఇచ్చారని చెప్పారు ఆ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకి బన్నీ అమ్మగారు నాకు ఒక విషయం గుర్తు చేశారు.

అలాగే తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం  కూడా చెప్పుకొచ్చారు హీరో వెంకటేష్, మహేష్ బాబు మరియు అల్లుఅర్జున్ లను   హీరోలుగా నేనే పరిచయం చేశాను అని చెప్పుకొచ్చారు. అయితే వెంకటేశ్ ఇంకా సినిమాల్లోకి రాకముందు, నా దర్శకత్వంలో నటిస్తున్నట్టుగా ఆయనకి కల వచ్చిందట ఏ విషయం రామానాయుడు గారు అతడితో చెప్పారని చమత్కరించారు అదే నిజమైంది అని చెప్పారు.

అలాగే మహేష్ బాబు విషయం లో కూడా అలాగే జరిగిందని అని కృష్ణగారు నన్ను  నేనే హీరోగా పరిచయం చేయాలని  కోరడంతో అలాగే చేశానని వివరించారు. అన్నమయ్య సినిమా విషయం లో చాల కష్టపడ్డానని ఆయన ఆ చిత్రం చాల సంతృప్తిని  ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులలో అద్యాత్మక చిత్రాలపైనా కూడా మక్కువ ఉంది అని మంచి కథ కోసం వెతుకుతున్నాం అని బదులిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: