దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు... సగటు తెలుగు ప్రేక్షకుడికి ఈ పేరు తెలియనిది కాదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి... ఎన్నో విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ప్రస్తుతం టాప్ హీరోలు గా కొనసాగుతున్న ఎంతో మంది హీరోలను సైతం తన దర్శకత్వం లో  మొదటి సినిమాతో బాటలు వేసిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. టాలీవుడ్ దర్శకులు గా ఎంట్రీ ఇస్తున్న ఎంతోమందికి స్ఫూర్తి ఈయన . కె రాఘవేంద్రరావు సినిమాలంటే తెలుగుతనం ఉట్టిపడేలా ఉంటుంది. హీరోయిన్ అను ఎలా చూపిస్తే ఎంత అందంగా కనిపిస్తారు...ఎక్కడ  చూపిస్తే ప్రేక్షకులు మైమరచిపోతారు అన్నది దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెలిసినట్లుగా ఏ దర్శకుడికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. తన సినిమాల్లో  హీరోయిన్ ను  అతిలోక సుందరి లాగా చూపిస్తుంటారు కె.రాఘవేంద్రరావు. 



 అంతే కాకుండా ఆయన సినిమాల్లో  సంగీతానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక తన సినిమాలు హీరోయిన్ల చాటుమాటు అందాలను చూపిస్తూ... సినీ ప్రేక్షకుల మతి పోగొడుతుంటారు  దర్శకేంద్రుడు. వందల సినిమాలకు దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావు టాలీవుడ్  దర్శకులు అందరికీ దర్శకేంద్రుడి గా  మారిపోయాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తాజాగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు దర్శకేంద్రుడు. వెంకటేష్ మహేష్ బాబు అల్లు అర్జున్ లను  తానే హీరోలుగా  ఇండస్ట్రీకి పరిచయం చేశానని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెలిపారు. అయితే హీరో వెంకటేష్ ఇంకా సినిమాల్లోకి రాకముందే... నా దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేసినట్లుగా వెంకటేష్ కి కల  వచ్చిందట... ఇక చివరికి అదే నిజమైంది అంటూ దర్శకేంద్రుడు తెలిపారు.. 



 ఇక మహేష్ బాబు ను కూడా తానే హీరోగా పరిచయం చేయాలని కృష్ణగారు కోరడంతో అలాగే చేసాను  అంటూ దర్శకేంద్రుడు చెప్పుకొచ్చారు. స్టైలిష్ స్టార్ బన్నీ నీ  కూడా గంగోత్రి సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయం చేసారు దర్శకేంద్రుడు . అయితే గంగోత్రి సినిమా చేసే సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందట. బన్నీ హీరోగా పరిచయం చేసిన గంగోత్రి సినిమా తన 100వ  సినిమా అని... ఆ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకి... అల్లుఅర్జున్ అమ్మగారు దర్శకేంద్రుడుకి  ఓ విషయం గుర్తు చేశారట. అదేంటంటే ఓ సారి  చిరంజీవి  బర్త్ డే  సందర్భంగా కే రాఘవేంద్ర రావు  చిరంజీవి ఇంటికి వెళ్లారట... అక్కడ చిరంజీవి పాటలకు వాళ్ళ పిల్లల డాన్స్ లు చేస్తుండగా అందులో  బన్నీ కూడా ఉన్నారట. అయితే బన్నీ డాన్స్ బాగుందంటూ ఎప్పటికైనా హీరోగా మొదటి  సినిమా తానే తీస్తాను అనీ ఇదిగో  అడ్వాన్స్ అంటూ సరదాగా 100 రూపాయలు అల్లు అర్జున్  అమ్మగారికి ఇచ్చాడట దర్శకేంద్రడు . ఈ విషయాన్ని అల్లు అర్జున్ అమ్మగారు గంగోత్రి సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజుల తర్వాత గుర్తు చేయడంతో తనకు చాలా ఆశ్చర్యం కలిగింది అంటూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: