గొల్లపూడి మారుతీరావు తెలుగు కళామతల్లికి ఎన్నో  రకాలుగా సేవలందించిన గొప్ప వ్యక్తి. ఒక సుప్రసిద్ధ రచయితగా నటుడిగా సంపాదకుడిగా వ్యాఖ్యాతగా విలేకరిగా తెలుగు సాహిత్య అభివృద్ధికి గొల్లపూడి మారుతీరావు ఎంతో కృషి చేశారు. ఇక తెలుగు సినీ ప్రేక్షకులకు గొల్లపూడి మారుతీరావు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు మాటల రచయితగా పరిచయమైన గొల్లపూడి మారుతి రావు... సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రల్లో నటించి  తన నటనతో మెప్పించారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కి  గొల్లపూడి మారుతి రావు రాకముందు నాటకాలు కథలు నవలలు రాశారు. అయితే డాక్టర్ చక్రవర్తి అనే సినిమాతో మొదటగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు గొల్లపూడి మారుతీ రావు . అయితే ఈయన మొదటి సినిమా అయినా డాక్టర్ చక్రవర్తి సినిమా తోనే  రచయితగా నంది అవార్డును సైతం అందుకున్నారు గొల్లపూడి మారుతీ గారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు నంది అవార్డును అందుకున్నారు. 



 అయితే మారుతీరావు ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో బిరుదులు అందుకున్నారు. ఉత్తమ కథా రచయితగా స్క్రీన్ ప్లే రచయితగా సంభాషణల రచయితగా నటుడిగా ఇలా అన్ని విభాగాల్లో  అవార్డు అందుకున్నారు. ఆనాటి  డాక్టర్ చక్రవర్తి సినిమా నుంచి ... ఈనాటి లీడర్ సినిమా వరకు ఆయన తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే వారు గొల్లపూడి మారుతిరావు . గొల్లపూడి మారుతీరావు ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత గొల్లపూడి మారుతీరావు వెనుదిరిగి చూడలేదు. వరుస సినిమాలు చేసుకుంటూ తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు గొల్లపూడి మారుతీరావు. హాస్యనటుడిగాను   గొల్లపూడి మారుతీరావు తెలుగు ప్రేక్షకులకు కొసమెరుపు. దాదాపు 250 పైగా చిత్రాల్లో నటించారు గొల్లపూడి మారుతీరావు. 



 సినిమాల్లోకి రాకముందు బుల్లితెరపై కూడా పలు ఛానెళ్లలో  వ్యాఖ్యాతగా వ్యవహరించారు మారుతీ రావు. పలు ఛానెళ్లలో  కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశారు మారుతీరావు. మొదటగా 1963 సంవత్సరంలో డాక్టర్ చక్రవర్తి అనే సినిమా స్క్రీన్ ప్లే అందించారు గొల్లపూడి మారుతీరావు. సినిమాల్లోనే కాకుండా గొల్లపూడి మారుతి రావు కు నాటకాల్లో కూడా పలు పురస్కారాలు అందుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: