గొల్లపూడి మారుతీరావు పేరు తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈయన ఓ నటుడు. ఎన్నో పాత్రల్లో జీవించి ప్రేక్షకుల మనసుపై చెరగని స్దానాన్ని సంపాదించుకున్న సహజ నటుడు. కాని ఆయనలో ఎవరికి తెలియని ఓ కోణం ఉంది. అదేమంటే  గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత కూడా. ఆయన సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టి సినీ రంగంలో మాటల రచయితగా, బుల్లితెరపైనా వ్యాఖ్యాతగా తనదైన ముద్రవేశారు.


అంతే కాకుండా వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరును సంపాదించారు. ఇప్పటికి తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన ఎన్నో పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగ పడుతున్నాయి. ఇక బీఎస్సీ పూర్తి చేసిన ఆయన ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా 1959లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా రేడియోలో ఎంపికయ్యి హైదరాబాదు, విజయవాడల్లో పనిచేశారు. ఆ సమయంలోనే కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందాక, సంబల్‌పూర్, చెన్నై, కడప కేంద్రాల్లో పనిచేశారు.


ఇకపోతే ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా  1981లో పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలుగా అందులో పనిచేశారు. ఆ తర్వాత అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు. ఇకపోతే కోడి రామకృష్ణ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడిగా, తెరకెక్కిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేయడమే కాకుండా ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు.


ఇదే కాకుండా రాఘవ కళానికేతన్‌ పేరున నాటక బృందాన్ని  చిన్న వయసులోనే నడిపారు గొల్లపూడి. ఇక ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి మారుతీరావు పలువురు ప్రముఖుల్ని ఇంటర్య్వూ చేయడమే కాకుండా, మనసున మనసై, ప్రజావేదిక, వేదిక, సినీ సౌరభాలు తదితర కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా ఆయన వ్యవహరించారు... 


మరింత సమాచారం తెలుసుకోండి: