గొల్లపూడి మారుతీరావు పరిచయం అక్కర్లేని ప్రజ్ఞావంతుడు. రచయిత, నటుడు, కథకుడు, నాటక రచయిత, నవలాకారుడు, రేడియోప్రయోక్త, సాహితీవేత్త… ఇలా బహుముఖీనం ఆయన ప్రతిభ. సినిమాలకు కూడా మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ నెట్ పేపర్లలో కాలమిస్టుగా పనిచేస్తున్నారు. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాత కూడా... రచయితగా 60 ఏళ్లు నటుడిగా 47 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ 78 ఏళ్ల బహుముఖ ప్రజ్ఞాశాలి నిత్య దైవారాధికుడు. ఎక్కడైనా ఎవరైనా ప్రవచనాలు చెబుతున్నారని తెలిస్తే సతీ సమేతంగా వెళ్లి ఏదో ఓ మూల కూర్చొని వింటూ లీనమైపోతారు. దైవం పట్ల భీతి ఉండటం కంటే ప్రీతి ఉండటం మేలని ‘నేను నా దైవం’ శీర్షిక కోసం గొల్లపూడి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.


ఆయ‌న‌ది ఓ మ‌ధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం.  పుట్టింది విజయనగరం. పెరిగింది విశాఖ. చిన్నప్పుడు విశాఖపట్నం నుంచి విజయనగరంకు ప్రయాణం అంటే  పెద్ద విశేషంగా ఉండేది.  అప్పట్లో విజయనగంలో ఎడ్ల బళ్లలో తిరిగేవారు. మా నాన్న గారు కంపెనీలో గుమస్తాగా జీవితాన్ని ఆరంభించి  కంపెనీ ఇన్‌చార్జి స్థాయికి ఎదిగారు. పెద్ద కలలకు పోకుండా గౌరవ ప్రదంగా బతికే వాళ్లు. ఏ రోజూ భోజనం లేదు మంచినీళ్లు లేవు అనే పరిస్థితి మా జీవితాల్లో ఎప్పుడు ఎదుర్కో లేదు. గౌరవంగా, తృప్తిగా, డిగ్నిఫైడ్‌గా జీవించాం.  భేషజాలకు పోని ఫాల్స్‌ ప్రెస్టేజ్‌ ప్రమేయం లేని ప్రశాంతమైన డిగ్నిఫైడ్‌ జీవితం గడపడం ఆయ‌న‌కు వారి తల్లిదండ్రులు నేర్పారు. వాళ్ళ నాన్న‌ గారు రోజూ గాయత్రి జపం చేసేవారు. అమ్మగారు భగవద్గీత చదివేవారు. సుదర్శన నామం చేసేవారు.  తల్లిదండ్రులతో కలిసి ప్రతి ఏటా పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు. ఆ తర్వాత ఏనాడు దైవ చింతన వదల్లేదు. ఉద్యోగంలోనే కాదు..రచయతగా..నటుడిగా ఎక్కడకు వెళ్లినా దైవారాధన వీడలేదు. అందుకే బీఎస్సీ హానర్స్‌ పూర్తి కాగానే రచనా రంగంపై ఉన్న మక్కువతో  20 ఏళ్లకే జర్నలిజంలో అడుగుపెట్టారు మారుతిగారు.  1961లో వివాహమైంది. 1962 అక్టోబర్‌కు పెద్దబ్బాయి పుట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆల్‌ ఇండియా రేడియోలో ఇంటర్వ్యూ వచ్చింది. 20 ఏళ్ల అందులో ప‌ని చేశారు.
దేవుడికి భయపడటం సరి కాద‌ని. దేవున్నిప్రేమించాల‌నేవారు. దేవుడిలో మమేకం కావాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడి దగ్గర చనువు ప్రదర్శించగలగాలి. దేవుడి పట్ల భయం ప్రదర్శిస్తూ దూరం ఉండేకంటే దేవుని దగ్గర నిష్కపటంగా సర్వసన్నిహితంగా ఉండటం సరిౖయెనదని నేను భావిస్తాను. దైవారాధన చేయాల్సింది భయంతో కాదు భక్తితో. రోజూ దేవుణ్ణి దర్శించడం, గుడికి వెళ్లడం, లేదా దైవ నామస్మరణ చేయడం వల్ల మనకు ఆత్మశక్తి వస్తుంది అని ఆయ‌న అనేవారు.


మరింత సమాచారం తెలుసుకోండి: