నానా పటేకర్ పై తనుశ్రీ దత్తా చేసిన కామెంట్స్ తో మీటూ ఎఫెక్ట్ ఉదృతంగా మారింది. నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసింది. ఓ సీనియర్ యాక్టర్ మీద తను శ్రీ అలా బహిర్గతంగా కామెంట్స్ చేయడం వల్ల మిగతా వారు కూడా తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు.


కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు సింగర్స్ కూడా తమపై జరిగిన వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. అయితే తను శ్రీ దత్తా నానా పటేకర్ మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బిగ్ బాస్ 13 కంటెస్టంట్ కోయినా మిత్రా. సల్మాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 13వ సీజన్ లో రెండోవారం ఎలిమినేట్ అయిన కోయినా మిత్రా పదేళ్ల క్రితం జరిగిన విషయాన్ని తను శ్రీ అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు బయటపెట్టిందని అన్నది.


ఒకవేళ వేధింపులు ఖండించాల్సి వస్తే అప్పుడే బయటపెడితే బాగుండేది కదా అంటూ తను శ్రీ చేసింది తప్పన్నట్టుగా మాట్లాడారు కోయినా మిత్రా. అయితే అప్పుడు బయట పెడితే వారికి అవకాశాలు రావన్న కారణం చేత సైలెంట్ గా ఉండి ఉంటారు. నానా పటేకర్ పై కామెంట్స్ చేయడం వల్లే తను శ్రీ దత్తాకు మళ్లీ పాపులర్ అయ్యింది. దానితో కొన్ని యాడ్స్ కూడా చేసిందని అన్నారు కోయినా మిత్రా.  


ఇక బాలీవుడ్ లో తనకు నచ్చే హీరోయిన్ ఎవరంటే కంగనా రనౌత్ అని అన్నారు కోయినా. ఎలాంటి విషయమైనా సరే మొహం మీద అడిగే ధైర్యం కంగనాకు మాత్రమే ఉందని అన్నారు. నిజమైన ఫెమినిజం అసలైన నిర్వచనం కంగనా మాత్రమే అన్నారు కోయినా మిత్రా. తన సోదరిని పొగిడినందుకు కొయినాను ప్రశంసించింది కంగనా సోదరి రంగోలి.   
 


మరింత సమాచారం తెలుసుకోండి: