బిగ్ బాస్ 3 షో ముగిసింది కాని దాని తాలూకూ గుర్తులు మాత్రం ప్రేక్షకులు మరవలేకున్నారు. ప్రేక్షకులే కాదు ఆ షోలో ప్రేమ పూర్వకంగా ఒకరినొకరు అర్ధం చేసుకున్న కంటెస్టెంట్ కూడా బిగ్‌బాస్ షో నుండి బయటకు వచ్చాక టచ్‌లోనే ఉంటున్నారట. ఇకపోతే ఎంతో హంగామా, మరెన్నో అల్లర్లతో, గొడవలతో, అలకలతో బిగ్‌బాస్ 3 షో నడిచింది.


ఈ షోలో పాల్గొన్న ప్రతి కంటెస్టెంట్ చాలా బాగా ఆడి షోకు అందం తేగా ఈ షో చూస్తున్న ప్రతి ప్రేక్షకున్నే కాదు, బిగ్‌బాస్ న్యాయనిర్ణేతను కూడా ఆకట్టుకున్న జంటగా అదేనండి ప్రేమ జంటగా అలరించిన  రాహుల్‌-పునర్నవిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


వీరి సాన్నిత్యాన్ని చూసిన ప్రతివారు ఆశ్చర్యపోయారు. వీరిది స్నేహమో, లేక ప్రేమనో అని ఇప్పటికి తేల్చుకోలేక పోతున్నారు. ఇకపోతే వీకెండ్‌లో వచ్చే నాగార్జున వారి మధ్య అలకలను, ప్రేమను గుర్తుచేస్తూ సెటైర్లు విసిరేవాడు. ఇక ఇంట్లో ఏం జరిగినా ఇద్దరు కలిసే ఉండటం ప్రేక్షకులను మెప్పించింది.


ఇదే కాకుండా పునర్నవి రాహుల్‌కు గోరుముద్దలు తినిపించడం, అదే సమయంలో తప్పుచేస్తే అతన్ని చెడామడా తిట్టడం నిజమైన ప్రేమికులను గుర్తుచేసింది.. ఇకపోతే టాస్క్‌లు ఆడటం చేతకాదని పేరు తెచ్చుకున్న రాహుల్‌.. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర జ్యూస్‌ను గటగటా తాగి ఆమెను నామినేషన్‌ నుంచి తప్పించగా, ఆనందం పట్టలేని పునర్నవి.. రాహుల్‌ను హత్తుకుని గట్టిగా ముద్దులు కూడా పెట్టింది.


ఇక పునర్నవి ఎలిమినేట్‌ అయినపుడు రాహుల్‌ వెక్కివెక్కి ఏడ్వటంతో ఆమెపై ఉన్న ప్రేమ మరోసారి బయటపడింది. పదకొండోవారంలో ఎలిమినేట్ అయిన పునర్నవి బయటకు వచ్చాక, రాహుల్‌తో కలిసి ఫేస్‌బుక్‌ లైవ్‌ చేస్తానని కూడా అభిమానులకు మాటిచ్చింది. ఇదిలా ఉండగా అటు గ్రాండ్‌ ఫినాలే స్టేజిపై రాహుల్‌ను విజేతగా ప్రకటించిన తర్వాత పునర్నవి తనను ఎంకరేజ్‌ చేసిందని రాహుల్‌ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఇకపోతే అటు రాహుల్‌, ఇటు పునర్నవి.. మేం ఇద్దరం ప్రాణస్నేహితులమంటూ ఎప్పటికప్పుడు మాట దాటవేస్తూనే ఉన్నారు.


అయితే రాహుల్‌ తల్లిదండ్రుల మాటలు ప్రేక్షకులను చిక్కుల్లో పడేశాయి. వారిది స్నేహమా? ప్రేమా అన్న అనుమానం వీక్షకుల్లో తలెత్తుతోంది. ఇదిలా ఉండగా రాహుల్‌ తల్లిదండ్రులు రాహుల్‌కు లైఫ్‌ సెట్‌ చేసే పనిలో పడ్డారు. రాహుల్‌ వచ్చిన తర్వాత అన్ని విషయాలు అడిగి వారికి ఇష్టమైతే పెళ్లి చేస్తామని ప్రకటించారు. ఇక వారిద్దరు ఒప్పుకుంటే బిగ్‌బాస్ షో బంధం విడలేని మూడుముళ్ల బంధంగా మారుతుందన్నమాట అని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: