తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా  ప్రారంభమైన షో బిగ్ బాస్  తెలుగు సీజన్ 3. అయితే ఈ షో మొన్నటి ఆదివారంతో ముగిసింది. వంద రోజులకు పైగా  బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ షో లో ... రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ నిలిచాడు. ఇతర శ్రీముఖి రన్నరప్ గా  నిలిచింది. అయితే వంద రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు సీసన్ 3 ఆదివారం ఎపిసోడ్ ముగియటటంతో  తో ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ తక్కువ అయ్యిందనే  చెప్పాలి. బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 టైటిల్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్  ఫుల్ పార్టీ చేసుకున్నారు. అయితే బిగ్ బాస్ షో లో అత్యధిక ఓట్లతో విన్నర్ గా  నిలిచిన రాహుల్ సిప్లిగంజ్  ప్రస్తుతం యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక చాలామంది అమ్మాయిలను బిగ్ బాస్ హౌస్ లో తనకు స్మైలింగ్ పేస్ తో పడేసాడు కూడా.కాగా  బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ 50 లక్షల భారీ నగదు అందుకున్నాడు. 

 

 

 

 50 లక్షల నగదుతో పాటు బిగ్ బాస్ ట్రోఫీ  కూడా అందుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎపిసోడ్ కు టైటిల్ ప్రెజెంట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 టైటిల్ అందుకున్నాడు. అయితే బిగ్ బాస్ టైటిల్ అందుకున్న రాహుల్ 50 లక్షల బారి  గెలిచాడు . అయితే టీవీల్లో  50 లక్షల భారీ నగదు రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడని చూపినప్పటికీ... రాహుల్ కి మాత్రం 50 లక్షల ప్రైజ్ మని  అంద లేదనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్  ఒప్పందం ప్రకారం టైటిల్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కు 50 లక్షలు నగదు అందాలి... కానీ రాహుల్ కి మాత్రం 35 లక్షలే  దక్కయని  అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

 

 

 

 

 అయితే దీని వెనుక కారణం కూడా లేకపోలేదు. ఇన్ కమ్  టాక్స్ నిబంధనల ప్రకారం సెక్షన్ 56(2)(ib)  కింద లాటరీలు,  గుర్రపు పందాలు,  అలాగే టెలివిజన్ షోలలో  ఏదైనా ప్రైస్ మనీ గెలిస్తే గెలిచిన మొత్తం అమౌంట్ నుంచి దాదాపు 31.20 శాతం టాక్స్  చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా గెలిచిన రాహుల్ సిప్లిగంజ్ 50 లక్షలు ప్రైజ్ మనీ గెలిచినప్పటికీ... టాక్స్ కట్టడం ద్వారా రాహుల్ కి 35 లక్షలు మాత్రమే అందాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా రోజు బిగ్ బాస్ ని చూసి కాస్త ఎంటర్టైన్మెంట్ పొందే టెలివిజన్ ప్రేక్షకులు... బిగ్ బాస్ షో ముగియడంతో కాస్త ఎంటర్టైన్మెంట్ తగ్గిందని ఫీలవుతున్నారు. అంతేకాకుండా  తమ తమ అభిమాన  సెలబ్రిటీలను  అందరిని ఒకే హౌస్ లో చూడడం కుదరదని కాస్త ఫీలవుతున్నారు బుల్లితెర ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: