యువసామ్రాట్ నాగార్జున సరసన సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి, ఆ తర్వాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగారు. ఇక మధ్యలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి నటిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఇక అక్కడి నుండి పలువురు టాలీవుడ్ మరియు బాలీవుడ్ నటుల సరసన మంచి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరో స్టేటస్ సంపాదించడంతో పాటు, ఇటీవల బాహుబలి 2 భాగాల ద్వారా అద్భుత విజయాలు తన ఖాతాలో వేసుకుంది. 

ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం అనే డిఫరెంట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది అనుష్క. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నేడు అనుష్క తన 37వ పుట్టినరోజుని జరుపుకోబోతోంది. అంతేకాదు, ఇవాళ ఆమె తన పెళ్లి విషయమై ఒక సంచలన విషయాన్ని కూడా వెల్లడించబోతున్నట్లు పలు మీడియా మాధ్యమాల్లో ఇప్పటికే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇకపోతే కొన్నాళ్ల నుండి ఆమెకు మరియు ప్రభాస్ కు పెళ్లి జరుగనుందని అనే వార్తలు వస్తుండడంతో, 

అనుష్క. ప్రభాస్ ని వివాహమాడే విషయాన్ని వెల్లడిస్తారా అంటూ కొందరు నెటిజన్లు సందేహంతో తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే నేటి పుట్టినరోజుని ఎంతో సరదాగా తన కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోనున్న అనుష్క, తన భవిష్యత్తు గురించి ఎటువంటి ప్రకటన చేస్తారు అనే విషయమై అందరిలోనూ ఎంతో ఆసక్తి ఉందనే చెప్పాలి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఆమె తన పెళ్లి నిర్ణయాన్ని వెల్లడిస్తే, అది నిజంగా ఆమె ఫ్యాన్స్ కు పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి. మరి నేడు ఆమె ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: