టాలీవుడ్‌ లో మరో క్రేజీ కాంబినేషన్‌ లో సినిమా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్స్‌గానే కాదు నటులుగానూ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ పొజీషన్‌లో ఉన్న ఇద్దరు క్రేజీ స్టార్స్‌ ఈ సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. హీరోగా స్టార్‌ ఇమేజ్‌తో పాటు నటుడిగా నేచురల్‌ స్టార్‌ గా ఎదిగిన హీరో నాని... పర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 

హీరోయిన్ గా టాప్‌ స్టార్స్‌ సరసన నటిస్తూనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో నటిగా ఆకట్టుకున్న హీరోయిన్ అక్కినేని సమంత. ముఖ్యంగా పెళ్లి తరువాత కమర్షియల్ సినిమాల కన్నా ఎక్కువగా విలక్షణ పాత్రలకు ఆసక్తి చూపిస్తు వరుసగా యూ టర్న్‌, మజిలీ, ఓ బేబీ సినిమాలతో సత్తా చాటింది. తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్‌ చేసింది ఈ అక్కినేని కోడలు. నాని, సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. నానితో నిన్నుకోరి, సమంత తో మజిలి సినిమాలను తెరకెక్కించిన యువ దర్శకుడు శివా నిర్వాణ ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌ తో సినిమాని తెరకెక్కించబోతున్నాడు. గతంలో నాని, సమంతలు ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాల్లో కలిసి నటించారు. మళ్ళీ ఇంత కాలానికి ఈ క్రేజీ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు మొదలైయ్యాయి.

నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వి' సినిమాలో నటిస్తున్నాడు. సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాని విలన్ గా నటిస్తున్నాడని టాక్‌. ఇక సమంత ప్రస్తుతం శర్వానంద్‌తో తమిళ సూపర్‌ హిట్‌ 96 రీమేక్‌లో నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ పూర్తయిన తరువాత సమంత, నానిల కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను నిన్ను కోరి, మజిలీ సినిమాలను నిర్మించిన షైన్‌ స్క్రీన్‌ సంస్థ నిర్మిస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: